ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎటువైపు?

ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎటువైపు?నెలన్నర ఎన్నికల ప్రచార హడావిడి ముగిసింది. పోలింగ్‌ కూడా ప్రశాంతంగా జరిగింది. నేడు ఫలితాలు. అయితే ఈ తడవ ఎన్నికల్లో ఓ ప్రత్యేక విషయం వ్యక్త మౌతుంది. అనేక సందర్భాల్లో ఏకపక్ష గాలి వీచి పార్టీల అంచనాలు తారుమారైన సందర్భాలున్నవి కానీ ఈ సారి అనూహ్యంగా కమ్యూనిస్టులకు, కాంగ్రెస్‌కు కాలం పట్టంగట్టే అవకాశాలు మెండుగా వున్నట్టున్నాయి. ఒక్క సారిగా బీజేపీ శిబిరం ఖాళీ కావటమే కొంత ఆశ్చర్యానికి గురి చేస్తుంది. పెద్ద పెద్ద నాయకులు చిన్న ఉపన్యాసాలతో రాష్ట్రం లో విన్యాసాలు చేసి వెళ్లారు. నిజానికి కాంగ్రెస్‌ పార్టీ ప్రక టించిన ఆరు గ్యారంటీల కన్న నిప్పులా రాజేసుకుంటున్న ప్రభుత్వ వ్యతిరేక ఓటు బాగా పెరిగిందనే చర్చజరుగుతోంది. ఈ వ్యతిరేక ఓటు ఎవరిని వరిస్తే వారిదే గెలుపు. అయితే ప్రజలు కూడా గెలుపు గుర్రాలకే ఓటు అన్న చందాన కాం గ్రెస్‌ పార్టీ పంచన చేరుతున్న సంకేతాలు స్పష్టంగా ఉన్నవి. అయితే పదేళ్ళ పాలనానంతరం మార్పు కావాలనే ప్రచారం జోరుగానే సాగుతున్నది. అయితే గెలుపెవరిదైనా ప్రకటించిన హామీల పరంపర ఒకింత భయాన్ని కలిగించేలా ఉన్నది.
విపరీత హామీలే వినాశకర పరిపాలనకు నాంది పలుకుతున్నాయి. అధికార పార్టీ లేదా ప్రతిపక్ష పార్టీ ఏదైనా త్వరలోనే కొత్త ప్రభుత్వం కొలువు దీరనుంది. అయితే ఈసారి ఎన్నికల్లో ఇచ్చిన హామీల పైత్యం రాజకీయ నాయకులకు బాగా పెరిగిందనే చర్చ నడిచింది. ఫలానా పార్టీ ప్రకటించే ఉచిత పథకాలకు సరిపడా రాష్ట్ర ఖజానా లేదు అంటూ వాదిస్తూనే అన్ని పార్టీలు అదేవిధంగా తాయిలాల్ని ప్రకటించడానికి వెనుకాడ లేదు. రోజు నాలుగు నుంచి పది మహాసభల్లో ప్రసంగించిన నాయకు లకు తామేమి మాట్లాడుతున్నామో, తామేమి వరాలిస్తున్నామో? ఆ వరాల ఫలితాలు, ప్రతిఫలాలు ఎలా ఉంటాయో మైమరచి విపరీత పోకడలకు పోయారు. మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడ ప్రాంతంలో నిర్వహించిన బహిరంగసభలో తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర రావు ప్రసంగిస్తూ మైనారిటీ యువకులకు ఐటీ హబ్‌ ప్రత్యేకంగా నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చారు. వెంటనే ప్రధాని మోడీ రంగంలోకి దిగి ధర్మం పేరిట ఐటీ హబ్‌లు ఏర్పాటు చేయడం వీలవు తుందా? ఇది మైనారిటీలను, ముస్లిం మతస్తులను ఆకట్టు కోవడం చేస్తున్న ఎత్తుకాదా?.. అంటూ కేసీఆర్‌పై విరుచుకుపడ్డారు. అవు ను.. కులం, మతం, ప్రాంతం ఆధారంగా రాజకీయాలు నేరప రాదు! పరిపాలనలో అలాంటి వాటికి స్థానం కల్పించరాదు. ఇదే సందర్భంగా ఒక ఆశ్చర్యకరమైన విష యాన్ని మనం గుర్తుకు తెచ్చుకోవాలి. కాంగ్రెస్‌ ఆరు గ్యారెంటీలపై, బీఆర్‌ఎస్‌ పార్టీ అనేక వారం టీలపై స్పందిస్తూ బీజేపీ అగ్రనాయకులు అమిత్‌షా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికా రంలోకి వస్తే ఉచితంగా గ్యాస్‌ సిలిండర్లు వంటివి ఇస్తామని ప్రకటిస్తూనే, పాల్గొన్న ప్రతి బహిరంగసభలోనూ అయోధ్యలో నిర్మితమ వుతున్న రామమందిర దర్శనాన్ని ఉచితంగా కల్పిస్తామని హామీ ఇచ్చారు.
ఇందులో ప్రశ్నించవలసిన మొదటిది ఏమంటే ఒక తీర్థయాత్ర లేదా పుణ్యక్షేత్ర దర్శనం కూడా ఓటర్లను ఆకర్షించే విధంగా రాజకీయాలను దిగజార్చడం. రెండవది రామమందిరం దర్శనానికి ఎవరు ఆసక్తి చూపుతారు? కేవలం ఒక ధర్మానికి సంబంధించిన వారు మాత్రమే కాదా? గురివింద గింజ తన మచ్చ ఎరుగనట్లుగా రాజకీయాలను పూర్తిగా అస్తిత్వ స్థాయికి తోసి వేసిన ఘనత ఇలాంటి పార్టీ వాళ్లదే కాదా? ముస్లిం లకు నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని బీఆర్‌ఎస్‌ ప్రకటిస్తే, ఆ రిజర్వే షన్లను రద్దు చేస్తామని బీజేపీ ప్రకటించింది. మరోచోటకు వెళ్లి గిరిజనులకు పన్నెండు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని బీజేపీయే చెబుతున్నది. ఈ ప్రకటన లన్నీ రాజకీయ ఆధిపత్యం కోసం సామాన్య ప్రజల మనోభావాలను అడ్డం పెట్టుకున్నట్టుగానే కనిపిస్తున్నాయి తప్ప నిజాయితీలేదు. ఎందుకంటే రిజర్వే షన్లు కల్పించాలంటే రిక్రూట్‌మెంట్లు ఉండాలి. నియా మకాలు లేకుండా నీతి వాక్యాలు ఎన్ని వల్లిం చినా ఉపయోగమేంటి? కేంద్రస్థాయిలో పరిపాలన సాగిస్తూ ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రాజకీయ విధానానికి తెరతీసిన బీజేపీ ఆస్తిత్వవాద రాజకీయాలు తప్ప సమధర్మపాలన అనే ఆలోచన దాదాపు తక్కువే.
తమిళనాడు, కేరళ, మధ్యప్రదేశ్‌, పంజాబ్‌ వం టి రాష్ట్రాల్లో ఓటర్లు తరచుగా ప్రభుత్వాలను మారు స్తుంటారు. నేడది తెలంగాణాలో ప్రతిబింబించేలా కనిపిస్తున్నది. ఏ పార్టీపై కూడా వ్యతిరేకత ఉండా ల్సిన అవసరం లేదు. అభివృద్ధి పనులు జరిగినా నియంతత్వానికి ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర పాలనలు అవకాశమిస్తున్నాయి. మితిమీరిన అహంకారం, నియంతత్వం, లెక్క చేయనితనం పెరిగిపోకూ డదు. అలాంటివి గమనిస్తే ఓటర్లు పోలింగ్‌ బూతుల్లో సమా ధానం చెబుతారు. ఒక వేళ కాంగ్రెస్‌కు అవకాశమొస్తే గతంలో చేసిన పొర పాట్లను చేయకుండా ప్రజా ఆశీర్వాద పనులు చేసుకునే అవకాశ మున్నట్లే. బీఆర్‌ఎస్‌ మెజార్టీ వస్తే ఈ ఎన్నికల ప్రచారంలో వ్యతిరేకంగా వీచిన గాలి తప్పకుండా ఒళ్లు దగ్గరబెట్టుకునేలా చేస్తుంది. ఎన్నికల సంఘం కన్నుగప్పి ఎక్కువ ఖర్చు చేసినా ప్రజలు మాత్రం రాజకీయాలపై చాలా చర్చలు జరిపారు. ఈ ఆలోచనలన్నీ ఆచరణ ల్లోకి మారి మార్పుకు నాంది పలికితే ఆహ్వానించదగినదే. ఏది ఏమైనా నేటి ప్రజాతీర్పు కోసం వేచిచూడాల్సిందే.
జి.తిరుపతయ్య
9951300016

Spread the love