నవతెలంగాణ-గండిపేట్
మణికొండ మున్సిపాలిటీలో అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా ఝూళిపించారు. మంగళవారం మ ణికొండ మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ ఆధ్వర్యంలో అక్ర మ నిర్మాణాలను కూల్చివేతలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలను గుర్తించారు. ఎలాం టి అనుమతులు లేకుండా నిర్మించిన అక్రమ భవనా లను కూల్చివేశారు. కమిషనర్ ఆదేశాల మేరకు టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది ఆధ్వర్యంలో అక్రమ ని ర్మాణాలను పెద్ద ఎత్తున కూల్చివేతలు చేశారు. నార్సింగి, రాయదుర్గ పోలీసులు బందోబస్తు నిర్వహించారు.