పేదల గోడు వినేదెవరు?

– గూడు కల్పించేది ఎవరు?
– అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు వినతి పత్రాలు
– ప్రజావాణిలో సైతం గూడు కోసం వినతి
నవతెలంగాణ-గజ్వేల్‌
పేదల గోడు వినేది ఎవరు? గోస తెల్లార్చేది ఎవరు?. ఏ పార్టీ నాయకులైన సమావేశాలు సభలు పెడితే అక్కడికి వెళ్తున్నారు. చెప్పుకుంటున్నారు. తమ గోడు నిన్న మొన్నటిది కాదని ఏండ్ల తరబడి అద్దె కుంటున్న కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.. గజ్వేల్‌ పట్టణంలో అద్దెలు రోజురోజుకు పెరిగిపోతున్నాయని నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశమంటుతున్నాయని వాపోతున్నారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆవేదన చెందుతున్నారు. ఇటీవల గజ్వేల్‌ పట్టణంలో 4 కిలోమీటర్లు కాలినడకన బీఆర్‌ఎస్‌ పార్లమెంటు అభ్యర్థి వెంకట్రాంరెడ్డి కార్యకర్తల సమావేశానికి వస్తున్నట్ల్టు తెలుసుకున్న లబ్ధిదారులు అక్కడికి చేరుకొని నిరసన తెలిపా రు. ఇదే సమావేశానికి వచ్చిన మాజీమంత్రి హరీశ్‌రావు ఎ దుట లబ్ధిదారులు నిరసన వ్యక్తం చేశారు. అధికారం మారు తున్నా తమ బతుకులు మారడం లేదని ఎవరూ పట్టి ంచుకో వడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంతేకా కుండా ప్రజావాణిలో కూడా చాలాసార్లు వినపత్రాలు అందించారు.
పేదలను గుర్తించి డబుల్‌ బెడ్రూంలు ఇండ్లు ఇస్తామని ఏడాది నర దాటినా ఇప్పటివరకు పేదలకు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్లు దక్కలేదు. డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇండ్ల లబ్ధిదా రుల ఓపిక రోజుకు నశించిపోతుంది. తమ ప్రభుత్వం అధికా రం లో లేదని మాజీ మంత్రి హరీష్‌ రావు లబ్ధిదారులకు చెప్పే ప్రయత్నం చేశారు. గజ్వేల్‌ ఎమ్మెల్యే మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్‌ గజ్వేల్‌ ప్రజల కు ముఖం కూడా చూపిం చడం లేదని లబ్ధిదారులు ఆవేదన చెందారు. మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని అగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ కు పార్టీ నాయకులకు చెప్పుకోవాలని మాజీ మంత్రి హరీశ్‌రావు సూచించారు. డబుల్‌ బెడ్‌రూమ్‌ల కోసం ఇటీవల లబ్దిదారులు రోడ్డు ఎక్కారు. రెండు గంటల పాటు స్థానిక అంబేద్కర్‌ చౌరస్తాలో సుమారు 1000 మంది లబ్ధిదారులు రోడ్డుపై బైటాయించారు. పిల్లాపాపలతో ఎర్రటి ఎండలో రాస్తారోకో నిర్వహించారు. ఏడేండ్లుగా ఇండ్లకోసం ఎదురుచూస్తున్నామని ఇక మాకు ఓపిక నశించిందని లబ్ధిదారులు వాగ్వివాదానికి దిగారు. ఎన్నికలు ముగిసిన మూడు నెలలు దాటుతున్న కూడా ఇప్పటివరకు ఇల్లు ఇవ్వలేకపోయారు. లబ్ధిదారులకు ఇల్లు కేటాయించాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జిల్లా కలెక్ట‌ర్‌కు, అధికార పార్టీ నాయకులకు ఇటీవల కలిసి వినతి పత్రా లు ఇచ్చినా ఫలితం లేకపోతుంది. లబ్ధిదారులు మాత్రం ఇప్పటికీ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు చుట్టూ తిరుగు తున్నారు. దీనిపై కాంగ్రెస్‌ ప్రభుత్వం స్పందించి పేదలకు ఇండ్లు పెంచాలని స్థానికులు కోరుతున్నారు.

Spread the love