ఈ మట్కా కింగ్‌ ఎవరు?

Who is this Matka King?వరుణ్‌ తేజ్‌ నటిస్తున్న తొలి పాన్‌ ఇండియా సినిమా ‘మట్కా’. కరుణ కుమార్‌ దర్శకత్వంలో వైర ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌ మెంట్స్‌ పతాకాలపై డాక్టర్‌ విజయేందర్‌ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి ఈ మూవీని నిర్మిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని విడుదల చేశారు మేకర్స్‌. ఇది వరుణ్‌ తేజ్‌ను యంగ్‌ స్టర్‌, అండ్‌ మిడిల్‌ ఏజ్‌ మ్యాన్‌గా రెండు డిఫరెంట్‌ అవతార్స్‌లో ప్రజెంట్‌ చేసింది. సినిమాలో నాలుగు డిఫరెంట్‌ గెటప్‌లలో హీరో 24 ఏళ్ల జర్నీని అద్భుతంగా చూపించనున్నారు. ‘కమాండ్‌ చేయటానికి, జయించడానికి అతను ఇక్కడ ఉన్నాడు. మట్కా కింగ్‌, వాసుగా మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌. త్వరలోనే బిగ్‌ స్క్రీన్స్‌పై మట్కా ఆట మొదలుకానుంది’ అని టీమ్‌ పేర్కొనడం మరింత క్యూరియాసిటీని పెంచింది. పీరియాడికల్‌ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో మీనాక్షి చౌదరి, నోరా ఫతేహీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

Spread the love