టికెట్ ఎవరికి దక్కేనో.?

– మంథని బీజేపీ అభ్యర్థిపై ఉత్కంఠ
– ఎవరి ధీమా…వారిదే
నవతెలంగాణ మల్హర్ రావు: మంథని నియోజకవర్గంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు ఖరారైయ్యారు.కానీ బీజేపీ అభ్యర్థి ఇంకా ఖరారు కాలేదు.ఇటీవల బీజేపీ11 మొదటి లిస్ట్ అభ్యర్థుల జాబితాను ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ లిస్టులో మంథని అభ్యర్థిని ప్రకటించలేదు.ఇక్కడ బీజేపీ నుంచి ఎవరు బరిలో నిలుస్తారనే ఉత్కంఠగా మారింది.రేపో మాపో మంథని బిజెపి అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది.ఇప్పటికే ప్రత్యర్థులు ప్రచారంలో దూసుకుపోతున్నారు.ఈ తరుణంలో ఇంకా తమ అభ్యర్థిని ప్రకటించకపోవడంపై బిజెపి శ్రేణుల్లో అసహనం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. చల్లా వర్సెస్ చందుపట్ల మంథనిలో బిఆర్ఎస్ నుంచి టికెట్ ఆశించి భంగపడిన చల్లా నారాయణరెడ్డి తాజాగా బీజేపీలో చేరారు. టికెట్ హామీ దక్కడంతోనే అపార్టీలో చెరినట్లుగా చల్లా వర్గీయులు చెబుతున్నారు.అయితే బీజేపీని క్షేత్రస్థాయిలో తీసుకెళ్తున్న సునీల్ రెడ్డి టికెట్ పై సందిగ్ధం నెలకొంది.మాజీ ఎమ్మెల్యే చందుపట్ల రాంరెడ్డి వారసుడిగా అప్పటి టిఆర్ఎస్ పార్టీలో చేరి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. కారుపై పోటీకి సిద్దవుతుండగా అనూహ్యంగా 2014లో పుట్ట మదుకు టికెట్ ఇవ్వడంతో ఇండిపెండెంట్ గా పోటీచేసి ఓడిపోయారు. తదనంతరం బండి సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరి పాదయాత్ర ద్వారా బీజేపీని గ్రామస్థాయి వరకు విస్తరించారు.2018లో బీజేపీ తరపున పోటీచేసిన రేండ్ల సనత్ కుమార్ పార్టీకి దూరంగా ఉండటంతో బీజేపీ టికెట్ తనకే వస్తుందని ఆశించారు.కానీ చల్లా రాకతో మరోసారి నిరాశ తప్పిరాలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

       బీజేపీ తరపున చల్లాకు టికెట్ ఖరారైతే కాంగ్రెస్, బీఆర్ఎస్ లో ఎవరికి నష్టం చేకూరుతొందనేది ఇప్పుడు మంథనిలో చర్చనియంగా మారింది. ఎవరి ధీమా వారిదే… ఇటు నారాయణరెడ్డి, అటు సునీల్ రెడ్డి ఎవరికి వారే నాకే ఎమ్మెల్యే టికెట్ వస్తోందని ప్రచారం చేసుకుంటున్నారు.దీంతో బీజేపీలో ఉన్న ద్వితీయ శ్రేణులు మాత్రం అయోమయంలో పడ్డారు.ఎవరికి టికెట్ వస్తుందో ఎవరికి మద్దతు తెలుపులో తెలియక నాయకులు ఆందోళనలో పడ్డారు.ఇద్దరిలో ఒకరికి టికెట్ వస్తే మరొక్కరు అధిష్ఠానం ప్రకటించిన అభ్యర్థికి సపోర్టు చేస్తారా లేదా ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారనేది మరో ఉత్కంఠగా మంథనిలో హార్ట్ టాపిక్ గా మారింది.

Spread the love