రూ.లక్ష రుణమాఫీ ఎందుకు చేయడం లేదు?

– బీఎస్పీ మండల ప్రధాన కార్యదర్శి లింగాల శ్రీనివాస్ ఆరోపణ
నవతెలంగాణ-బెజ్జంకి
రైతు సంక్షేమ ప్రభుత్వమని చెబుతున్న బీఆర్ఎస్ ప్రభుత్వం తామిచ్చిన రూ.లక్ష రుణమాఫీ హామీని గత నాలుగేళ్లుగా ఎందుకు అమలు చేయడంలేదని శుక్రవారం బీఎస్పీ మండల ప్రధాన కార్యదర్శి లింగాల శ్రీనివాస్ ఆరోపించారు.తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రైతు దినోత్సవ వేడుకలను బీఆర్ఎస్ ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించడం రైతులపై కపట ప్రేమను చూపడమేనని.. రైతు బందు పథకంతో చిన్న,సన్నకారు,కౌలు రైతులకు ఓరిగిందేమి లేదని.. భూస్వాములను మరింత కుబేరులుగా చేయడానికే బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తోందని.. ఇప్పటికైనా రూ.లక్ష రుణమాఫీ హామిని అమలు చేసి ఉచితంగా ఎరువులు పంపిణీ చేయాలని లింగాల శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Spread the love