తిరువనంతపురం: అదానీ అక్రమాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణకు మోడీ ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతుందని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రశ్నించారు. సీపీఐ(ఎం) కేరళ రాష్ట్ర కార్యదర్శి ఎంవి గోవిందన్ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రజారక్షణ యాత్ర ముగింపు సందర్భంగా తిరువనంతపురంలోని పుత్తిరికందం మైదానంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. కేరళలోని140 నియోజక వర్గాల మీదుగా సాగిన పాదయాత్రలో దేశాన్ని ప్రభావితం చేసే ముఖ్యమైన అంశాలపై చర్చించగలిగామని అన్నారు. మోడీ పాలనలో భారత ఆర్థిక వ్యవస్థ ధ్వంసమవుతోందని విమర్శించారు. భారతదేశంలో క్రోనీ క్యాపిటలిజం కనిపిస్తోందని తెలిపారు. అదానీపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచార ణను ప్రకటించేందుకు మోడీ ఎందుకు వెనుకాడుతున్నారని ఏచూరి ప్రశ్నిం చారు. ఎవరైనా విమర్శిస్తే దేశ వ్యతిరేకులు అవుతారని అన్నారు. కేరళను కేం ద్ర ప్రభుత్వం నిర్లక్ష్యానికి గురిచేస్తోందని విమర్శించారు. ప్రజాధనాన్ని దోచు కుంటున్న వారికి కేంద్రం అండగా నిలుస్తోందని ఏచూరి తెలిపారు.
రాష్ట్రపతి ప్రశంసలే మోడీ, అమిత్ షాలకు సమాధానం
రాష్ట్రపతి స్వయంగా కేరళ ప్రభుత్వానికి సర్టిఫికెట్ ఇచ్చారని పేర్కొన్న ఏచూరి.. కేరళ ప్రభుత్వం ప్రత్యామ్నాయ విధానాలను ప్రోత్సహిస్తోందని సూచించారు. ప్రశ్నించిన వారిని దేశ వ్యతిరేకులుగా మార్చే వైఖరికి వ్యతిరేకంగా ఈ మార్చ్ అని ఏచూరి తెలిపారు. తనకు140 కోట్ల మంది భారతీయుల మద్దతు ఉందని మోడీ చేస్తున్న ప్రచారం హాస్యాస్పదమన్నారు. గత ఎన్నికల్లో ఓటేసిన వారిలో 37 శాతం మందే బీజేపీ అనుకూలంగా ఓటు వేశారని తెలిపారు. కేంద్రం సబ్సిడీ కింద ఆహార ధాన్యాలకు కోత విధించిందన్నారు. ఈ విషయంలోనూ మోడీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తు న్నారని అన్నారు. రాజ్యాంగ వ్యవస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని విమర్శించారు. అందుకోసం గవర్నర్లను ఉపయోగిస్తున్నారని తెలిపారు.