నవతెలంగాణ ఢిల్లీ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI)కు సుప్రీంకోర్టు(Supreme Court) నోటీసులు ఇచ్చింది. ఎలక్టోరల్ బాండ్లకు చెందిన నెంబర్లను బహిర్గతం చేయాలని కోర్టు తెలిపింది. ఏ కంపెనీ ఏ పార్టీకి ఎంత విరాళం ఇచ్చిందో తెలియాలని సుప్రీం ప్రశ్నించింది. సీజే డీవై చంద్రచూడ్ (CJI DY Chandrachud) నేతృత్వంలోని ధర్మాసనం ఎలక్టోరల్ బాండ్ల(Electoral bonds) కేసులో ఇవాళ విచారణ చేపట్టింది. విశిష్టమైన ఆల్ఫా న్యూమరిక్ నెంబర్‌ను బ్యాంకులు వెల్లడించాలని ఆయన తెలిపారు. ఆ నెంబర్ ద్వారా ఆ విరాళాలు ఎక్కడికి వెళ్తాయో తెలుస్తాయన్నారు. బాండ్ల గురించి పూర్తి డేటాను ఇవ్వని ఎస్బీఐపై సుప్రీం సీరియస్ అయ్యింది. ఎస్బీఐ తరపున ఎవరు వాదిస్తున్నారని, వాళ్లు బాండ్ నెంబర్లను బయటపెట్టలేదని, ఎస్బీఐ ఆ నెంబర్లను వెల్లడించాలని సీజే చంద్రచూడ్ తెలిపారు. మార్చి 18వ తేదీన ఈ కేసులో మళ్లీ విచారణ ఉంటుందని, ఆ లోగా వివరణ ఇవ్వాలని సీజే తెలిపారు.