నవతెలంగాణ – హైదరాబాద్ : హైదరాబాద్‌లోని మీర్‌పేటలో భార్యను హత్య చేసిన కేసులో సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. నిందితుడు గురుమూర్తి మరో మహిళతో కలిసి ఉండేందుకే తన భార్యను హత్య చేసినట్లుగా పోలీసుల విచారణలో వెల్లడైంది. ఓ వెబ్ సిరీస్ ప్రేరణతో తన భార్యను కిరాతకంగా హత్య చేసినట్లుగా తెలుస్తోంది. భార్యను హత్య చేసి, ముక్కలుగా నరికి, శరీర భాగాలను బకెట్ నీళ్లలో వేసి హీటర్‌తో ఉడికించి మాంసాన్ని ముద్దగా చేసి చెరువులో వేశాడు. నిందితుడి ఫోన్‌ను పరిశీలించగా మరో మహిళతో ఉన్న ఫొటోలు లభ్యమయ్యాయి. ఈ దారుణ హత్య తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపింది.