– ఈడీని ప్రశ్నించిన ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ : ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను మరోసారి అరెస్టు చేస్తారా అని ఈడీని ఢిల్లీ హైకోర్టు బుధవారం ప్రశ్నించింది. కేజ్రీవాల్‌కు ట్రయల్ కోర్టు బెయిల్ మంజారు చేయడాన్ని సవాల్ చేస్తూ ఈడీ దాఖలు చేసిన పిటీషన్ విచారణ సందర్భంగా హైకోర్టు ఈ ప్రశ్న వేసింది. ‘నాకు అంతా అయోమయంగా ఉంది. మీరు ఏమి చేయాలనుకుంటున్నారు? మీరు మళ్లీ కేజ్రీవాల్‌ను అరెస్టు చేస్తారా?’ అని విచారణలో జస్టిస్ నీనా బన్సల్ ప్రశ్నించారు. ఇడి నమోదు చేసిన మనీలాండరింగ్ కేసులో కేజ్రీవాల్‌కు జూన్ 20న రూస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజారు చేసింది. అయితే దీనిపై హైకోర్టు స్టే ఇచ్చింది. కానీ సుప్రీంకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. అయితే సుప్రీంకోర్టు తీర్పునకు కొన్ని గంట ముందు సీబీఐ అరెస్టు చేయడంతో కేజ్రీవాల్ ఇంకా బెయిల్‌ల్లోనే ఉన్నారు. బుధవారం విచారణలో ఈడీ తరుపున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్‌వి రాజు వాదనలు వినిపించాల్సి ఉంది. కానీ మరొక కేసులో రాజు బిజిగా ఉన్న కారణంగా విచారణను వాయిదా వేయాలని కోరారు. దీంతో విచారణను సెప్టెంబరు 5కి హైకోర్టు వాయిదా వేసింది.