రేషన్ దారులకు అమ్మ హస్తం మళ్లీ అందేనా.?

  • ఆశగా ఎదురు ఎదురుచూస్తున్న లబ్దిదారులు
  • ప్రభుత్వ ప్రకటనతో కార్డుదారుల్లో హర్షం

నవతెలంగాణ మల్హర్ రావు
రేషన్ దుకాణాలు మళ్ళీ పూర్వ శోధనకు సంతరించుకొన్నాయా.? పేదలకు నిత్యావసర సరుకుల భారం తప్పనుందా.?  ప్రభుత్వ ప్రకటలో అదే నిజమనిపిస్తోంది.వీలైనంత త్వరగా రేషన్ దుకాణాల్లో సరుకులు పెంచుతామని ఇటివల సీఎం రేవంత్ ప్రభుత్వం ప్రకటించిన విషయం విదితమే.మళ్ళీ అమ్మహస్తం తెరపైకి వచ్చింది.పదేళ్ల క్రితం కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అమ్మహస్తం పథకం కింద 9 రకాల సరుకులను పంపిణీ చేసిన విషయం తెలిసిందే.దీంతో కార్డుదారులకు ప్రయోజనం చేకూరనుండగా డీలర్లు,హమాలీలకు ఉపాధి దొరకనుంది.

కార్డుదారులకు తగ్గనున్న 1.64 కోట్ల భారం

పదేళ్ల క్రితం తొమ్మిది రకాల సరుకులు ఇవ్వగా ఒక్కొక్క సరుకును కోత పెడుతుండటంతో నిరుపేద కుటుంబాలపై నెలకు రూ.1.64 కోట్ల భారం పడుతుండగా ఏటా రూ.64 లక్షలు లబ్దిదారులు అదనంగా ఖర్చు చేస్తున్నారు.గతంలో రేషన్ దుకాణాలను మినీ సూపర్ మార్కెట్లుగా మారుస్తామని చెప్పగా ప్రస్తుతం ప్రభుత్వం మారడం  సరుకుల సంఖ్యను పెంచుతామని ప్రకటించడంతో ఆశలు రేకెత్తుతున్నాయి.దారిద్ర్యరే

ప్రస్తుతం రెండే సరుకులు…..

లబ్దిదారులకు సరుకుల సంఖ్య ఏటేటా తగ్గడం ఆందోళనకు గురిచేస్తోంది.తొలుత పామాయిల్, తదుపరి కందిపప్పు,అనంతరం గోధుమలు,ప్రస్తుతం చక్కెర సరుకులకు మంగళం పాడడంతో ఇక రేషన్ దుకాణాలు ఎందుకన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది.మండలంలో  8,906 రేషన్ కార్డులు,24,709 లబ్దిదారులు ఉన్నారు.ఇందులో ఆహార భద్రత కార్డులు 7,521, అంత్యోదయ కార్డులు 13,85 ఉన్నాయి.ప్రతి నెల 3,99,035 మెట్రిక్ టన్నుల బియ్యం సరఫరా అవుతుండగా కేవలం అంత్యోదయ,అన్నపూర్ణ కార్డుదారులకు చక్కెర పంపిణీ చేస్తున్నారు.

డీలర్లకు ఉపాధి దెబ్బ…..

వాస్తవానికి నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుతున్న క్రమంలో రేషన్ దుకాణాల్లో అవసరమున్న సరుకులు అందుబాటులో ఉండాల్సి ఉండగా తదనుగుణంగా చర్యలు కరువైయ్యాయి.1884లో నిర్ణయించిన కమిషన్ నేటికి కొనసాగుతుండగా ప్రస్తుతం వస్తున్న సరుకులతో క్వింటాలు బియ్యాన్ని ఇచ్చేది రూ.75,ఖాళీ సంచులతో మంరో రూ.1800 వస్తుండగా నెలకు ఒక డీలర్ కు సగటున వచ్చే ఆదాయం అరలోరే.అద్దె, ఇతరాత్ర ఖర్చులు పెరుగుతుండగా మిగిలేది శూన్యం.ప్రభుత్వ ప్రకటనతో మళ్ళీ పాత రోజులు వస్థాయని ఉపాధి మెండుగా ఉంటుందని డీలర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

రేషన్ దునకాలు…19

మొత్తం కార్డులు…..8,906

ఆహారభద్రత కార్డులు…7,521

అంత్యోదయ కార్డులు….1,385

అన్నపూర్ణ కార్డులు….70

తక్కువ సరుకులతో నెలకు భారంరూ.1.64 కోట్లు

నెలల సరఫరా అవుతున్న బియ్యం…..3,99,035 మెట్రిక్ టన్నులు

సరుకులు అందించాలి…..అక్కల బాపు ప్రజా సంఘాల నాయకుడు

గతంలో కాంగ్రెస్ తొమ్మిది రకాల సరుకులు అందించింది. దీంతో చాలామంది పేదలు తక్కువ ధరకు సరుకులు పొందారు.ప్రస్తుతం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది.ప్రభుత్వం స్పందించి మళ్ళీ అమ్మహస్తం పున ప్రారంబించాలి.

Spread the love