సాగర్ ప్రయత్నాలు ఫలించేనా..?

– వారసుడు టికెట్ కు తండ్రి తీవ్ర ప్రయత్నాలు..
– బీజేపీలో వారసత్వం రాజకీయాలకు తావుందా..!?
– కేంద్ర నాయకులను ప్రసన్నం చేసుకోవడానికి అనేక దారులు వెతుకులాట..
నవతెలంగాణ – వేములవాడ: తనయుడి రాజకీయ భవిష్యత్తు కోసం సీనియర్ నాయకులు కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి, మాజీ మహారాష్ట్ర గవర్నర్ విద్యసాగర్ రావు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నెల చివరన బీజేపీ రెండవ ఎమ్మెల్యే అభ్యర్థులజాబితా విడుదల చేయనుంది. వచ్చే లిస్టులో తనయుడు వికాస్ పేరు వచ్చేలా కేంద్ర నాయకులు రాష్ట్ర బీజేపీ ఎన్నికల ఇన్చార్జ్ ప్రకాష్ జవదేకర్, సునీల్ బన్సల్ చుట్టూ తిరుగుతూ మంతనాలు చేస్తున్నారు. బిజెపి పార్టీలో కుటుంబ వారసత్వ రాజకీయాలు ప్రోత్సహిస్తున్నారా అన్నట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. కేంద్ర నాయకత్వమేమో బీజేపీలో కుటుంబ వారసత్వ రాజకీయాలకు తావు ఉండదని, కేంద్ర నాయకత్వం ఇతర పార్టీల నాయకుల పై విమర్శలు చేస్తారు.
త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీలో వారసత్వ రాజకీయానికి వేములవాడ టికెట్ వేదిక కాబోతుందా..? అనే చర్చ వేములవాడలో తీవ్రస్థాయిలో చర్చ జరుగుతుంది. అధికార బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై వారసత్వ కల్చరని విమర్శించే బీజేపీ నేడు ఆ కల్చర్ కే మార్గదర్శకాలు రచిస్తుందా..!? ఇప్పటికే విద్యాసాగర్ రావు అనుచరవర్గం బీజేపీలో గత కొంత కాలం క్రిందట పార్టీలో చేరిన ఇద్దరు నాయకులు వ్యక్తిగత ఇమేజ్ ని పెంచుకోడానికి మీడియాలో, సోషల్ మీడియాలో పార్టీ నిర్ణయానికి విరుద్ధంగా వ్యక్తిగత విషయాలను వస్తావిస్తూ మాట్లాడుతున్నారని, పార్టీ క్రమశిక్షణలో పనిచేయకుండా పార్టీ ఎదుగుదలకు గాని ప్రజా సమస్యల పై గాని కార్యకర్తలకు భరోసా లేకుండా వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడానికి మాత్రమే మీడియాలో, సోషల్ మీడియాలో పాకులాడుతున్నారని విమర్శిస్తున్నారు.
మొదటి నుండి ఎర్రం మహేష్, తుల ఉమా, చిన్నమనేని వికాస్ రావు బీజేపీ టికెట్ ఆశిస్తున్నారు. కానీ వీరిలో ఇద్దరు మాత్రం తీవ్రస్థాయిలో పోటీ పడుతున్నవారు, తుల ఉమా బీసీ సామాజిక తరగతి చెందిన మహిళ, సిహెచ్ వికాస్ వెల్మ సామాజిక తరగతి చెందిన వ్యక్తి. ఈ ఇద్దరు టికెట్ నాకంటే నాకు అని వేములవాడలో ప్రచారం చేసుకుంటున్నారు. వికాస్ గత నాలుగు సంవత్సరాలుగా వేములవాడ నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రతిమ స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా ప్రజలకు అనేక సేవా కార్యక్రమాల ద్వారా సేవలందించడం చేశారు, కానీ ఎక్కడ కూడా బీజేపీ పార్టీ తరఫున ఎన్నికల బరిలో ఉంటానని చెప్పలేదు. ఈ మధ్యనే హైదరాబాదులోని బీజేపీ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్ సమక్షంలో పార్టీలో చేరికయ్యారు.
అప్పటినుండి బీజేపీ  పక్షాన ఎన్నికల రణరంగంలో ఉండబోతుందని తెరపైకి వచ్చారు. గతంలో తుల ఉమా బీఆర్ఎస్ పార్టీ నుండి టికెట్ ఆశించింది, ఆశ నిరాశ కావడంతో ఈటల రాజేందర్ తో కలిసి బిజెపిలో చేరిన అప్పటినుండి వేములవాడ టికెట్ ఆశిస్తేనే వస్తుంది. వికాస్ అనుకూలంగా టికెట్ వచ్చేలా కార్యకర్తల అభిప్రాయాల మేరకు వేములవాడ నియోజకవర్గ అన్ని మండలాల అధ్యక్షులు ,ప్రధాన కార్యదర్శులు మీడియా సమావేశం నిర్వహించి మీడియా సమావేశం ద్వారా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వానికి, జాతీయ నాయకత్వానికి వేములవాడ అసెంబ్లీ బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ చెన్నమనేని వికాస్ కి కేటాయించాలని ఏకవాక్య తీర్మానం చేశారు. జాతీయ నాయకుల ఏమో బీజేపీలో వారసత్వ రాజకీయాలకు చోటు ఉండదని అంటారు..సాగర్ జి ప్రయత్నాలు ఫలించేనా.. వారసుడికి టికెట్ సాధించిన.. కొన్ని సంవత్సరాలుగా వేములవాడ టికెట్ ఆశిస్తూ వస్తున్న బీసీ అభ్యర్థి తుల ఉమకు టికెట్ కేటాయిస్తారా.. ఎవరికి ప్రాధాన్యత కల్పిస్తారు.. ఎవరికి కేటాయిస్తారు వేచి చూడాల్సిందే..

Spread the love