అన్నం పెట్టే వారిని ఆకలితో మాడుస్తారా.. ?

 Will those who put rice be starved..?– మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షులు గణేష్‌
– శంషాబాద్‌ ఎమ్మార్సీ కార్యాలయం వద్ద ధర్నా
– ఎంఈఓకు వినతిపత్రం అందజేత
– వెంటనే పెండింగ్‌ వేతనాలు చెల్లించాలని డిమాండ్‌
– ‘భోజనం’ ప్రయివేటుకు ఇస్తే సహించేది లేదు
– సమస్యలు పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళన
నవతెలంగాణ-శంషాబాద్‌
అన్నం పెట్టే వారిని ఆకలితో మాడ్చే సంస్కృతి ఏమి టని మధ్యాహ్న భోజన కార్మికుల సంఘం జిల్లా అధ్యక్షు లు గణేష్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ పాఠశా లల్లో వంట చేస్తున్న కార్మికులు మంగళవారం శంషాబా ద్‌ ఎమ్మార్సీ కార్యాలయం వద్ద ధర్నా చేసిన అనంతరం ఎంఈఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులకు మొండి చేయి చూపిందన్నారు. ప్రభు త్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెడుతున్నామని ఇది తమ ఘనతను చెప్పుకుంటున్న ప్రభుత్వం ఆ వంట చేసి పెడుతున్న మధ్యాహ్న భోజన కా ర్మికులకు ఖాళీ గిన్నెలు చూపిస్తున్నదన్నారు. ఒక్క రోజు వందల మంది విద్యార్థులకు వంట చేసి పెడితే ఆ కష్టం ఎలా ఉంటుందో వంటచేసి అవగాహన చేసుకోవాల న్నా రు. వంట చేసే వారిని కనీసం గుర్తించకుండా వారికి వేతనాలు చెల్లించకుండా ప్రభుత్వం మధ్యాహ్న భోజన ప థకాన్ని ఏ విధంగా ముందుకు తీసుకు వెళ్తుందో చెప్పాల న్నారు. వందల మంది విద్యార్థులకు వంట చేసి పెట్టడం ఆశామాషీ విషయం కాదన్నారు. ప్రభుత్వం ఆదుకుం టుందన్న చిన్న ఆశతో విద్యార్థులకు వంట చేసి పెడుతు న్నామని తెలిపారు. సరైన సమయానికి వేతనాలు, పెం డింగ్‌ బిల్లులు చెల్లించకపోవడం వల్ల తీవ్రంగా నష్టపోతు న్నామన్నారు. భోజన కార్మికుల పట్ల గత ప్రభుత్వం మాది రే ప్రస్తుత ప్రభుత్వం కూడా వివక్ష చూపిస్తుందన్నారు. తల్లి లాగా వంటలు చేసి పెడుతున్న మధ్యాహ్న భోజన కార్మికులను వద్దనుకొని పెండింగ్‌ వేతనాలు ఇవ్వకుండా ఉద్దేశపూర్వకంగా సతాయిస్తున్నారని తెలిపారు. కుటుం బంలో తల్లిలాగా పాఠశాలల్లో వంట చేసి పెడుతున్నామ ని ఆ గౌరవాన్ని మధ్యాహ్న భోజన కార్మికులకు ఇవ్వాల న్నారు. కార్పొరేట్‌ సంస్థలకు మధ్యాహ్న భోజన పథకాన్ని అప్పగించి తమ పొట్ట కొట్టే ప్రయత్నం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. హరే రామ-హరేకృష్ణ, అక్షయపా త్ర లాంటి సంస్థలకు మధ్యాహ్న భోజనాన్ని ఇచ్చే ఆలోచ నను విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు. పెండింగ్‌ వేతనాలను క్రమం తప్పకుండా నెల నెలా చెల్లించాలన్నా రు. ఈఎస్‌ఐ, పీఎఫ్‌, ఉద్యోగ భద్రత, ప్రమాదబీమా, డ్రె స్‌కోడ్‌ వంటివి కల్పించాలన్నారు. సమస్యల పరిష్కా రాని కి సీఐటీయూ నాయకులు కార్మికులను సీఎం చర్చలకు పిలవాలన్నారు. ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్ల ను పరిష్కరించకుంటే విధులు బహిష్కరించి రాష్ట్ర వ్యా ప్తంగా ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమం లో రాజేష్‌, భారతమ్మ, సావిత్రి, రవీందర్‌, సునీత, శివరా ణి, శారదమ్మ, లక్ష్మీదేవి, లావణ్య, రజిత పాల్గొన్నారు.

Spread the love