నవతెలంగాణ – నకిరేకల్
నకిరేకల్ నియోజకవర్గ సీపీఐ(ఎం) ఎమ్మెల్యే అభ్యర్థి బొజ్జ చిన్న వెంకులును గెలిపించి అసెంబ్లీకి పంపించాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో ఆదివారం మండలంలోని వివిధ గ్రామాలలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సీపీఐ(ఎం) అభ్యర్థి కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆ పార్టీ మండల కార్యదర్శి రాచకొండ వెంకట్ గౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలు దొందు దొందేనని విమర్శించారు. నకిరేకల్ పోరాటాల వారసత్వ నియోజకవర్గమైన ఈ కేంద్రంలో సిపిఎం అభ్యర్థి బొజ్జ చిన వెంకులను గెలిపించినట్లయితే పోరాట వారసత్వాన్ని నిలబెడతారని పేర్కొన్నారు. సిపిఎం ఎమ్మెల్యే లేని అసెంబ్లీ పూజారిలేని దేవాలయం లాంటిదని పేర్కొన్నారు. ప్రజలు ఆలోచించి ప్రజాపక్షాన నిలబడే సిపిఎం అభ్యర్థి సుత్తి కోడలి నక్షత్రం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మర్రి వెంకటయ్య, నాయకులు దోరేపల్లి ఎల్లయ్య, కొప్పుల అంజయ్య తదితరులు పాల్గొన్నారు.