
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు కులగణన వెంటనే ప్రారంభించా లని, లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని బీసీ సంక్షేమ సంఘం మండల కన్వీనర్ కడారుల నరసయ్య హెచ్చరించారు. శుక్రవారం వారు మాట్లాడుతూ.. వారు విలేకరులతో మాట్లాడుతూ బీసీ సంక్షేమ సంఘం, బీసీ కుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కులగణనను వెంటనే ప్రారంభించాలని, బీసీ రిజర్వేషన్లు 42 శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తూ సెప్టెం బర్ 2న జిల్లా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.