- విరిగిన విద్యుత్ స్తంభాలు, ఒరిగిన చెట్లు, ఎగిరిన ఇంటిపై కప్పు (రేకులు)…
- భారీ వర్షంతో సేదతీరిన ప్రజలు, కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం ….
నవ తెలంగాణ భువనగిరి కలెక్టరేట్
మండల వ్యాప్తంగా శుక్రవారం రాత్రి ఈదురు గాలి, ఉరుములు, మెరుపులతో కురిసిన భారీ వర్షం గ్రామాల్లో విధ్వంసం సృష్టించింది. ఈదురు గాలులకు ఆకుతోటబావితండా, కాండ్లకుంటతండా, పచ్చర్లబోడుతండా, సూరెపల్లి గ్రామాల్లో ఇంటి పై కప్పులు రేకులు లేసి నేలకొరిగాయి. దింతో పలు రేకులు, పెంకటీల్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అలాగే గ్రామాల్లో డ్రైనేజీ వ్యవస్ధ లేక అంతర్గత, ప్రధాన రహదారులు చిన్నపాటి చెరువులను తలపించగా, వాగు, వంకలు పొంగిపొర్లాయి.
దీంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. దీనిపై పంచాయతీ కార్యదర్శి, సంబంధించిన అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందన లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలు గ్రామాల్లో ఈదురు గాలులకు రహదారులపై పెద్ద, పెద్ద చెట్లు విరిగిపోయి రాకపోకలకు అంత రాయం ఏర్పడగా, వాటిని తొలగింపు చర్యలను అధికారులు చేపట్టారు. ఈదురు గాలుల విధ్వంసానికి విద్యుత్ స్తంభాలు విరిగిపో వడంతో పలు గ్రామాల్లో సరఫరా నిలిచిపోయిందని ఏఈ ఆకుల హేమ సుందర్ కుమార్ తెలిపారు. సుమారు రూ. 2 లక్షల 30 వేలు నష్టం వాటిల్లిం దన్నారు. గ్రామాల్లో విద్యుత్ సరఫరాను పునరుద్ధరిచేందుకు ట్రాన్స్‌కో సిబ్బంది చర్యలు చేపట్టారు. ఎండలకు అల్లాడిన ప్రజలు ఈ భారీ వర్షానికి సేదతీరారు