ఏపీలో మూడు రోజులు వైన్స్ బంద్..

నవతెలంగాణ – హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఓట్ల లెక్కింపు సజావుగా సాగేందుకు, అల్లర్లు చెలరేగకుండా ముందుజాగ్రత్త చర్యగా మూడు రోజుల పాటు వైన్స్ షాపులను బంద్ చేయాలని ఆదేశించింది. జూన్ 4 న కౌంటింగ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో జూన్ 3 నుంచి 5 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మద్యం షాపులను తెరవొద్దని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Spread the love