క్రీడల్లో గెలుపోటములు సహజం

నవతెలంగాణ-జహీరాబాద్‌
క్రీడల్లో గెలుపోటములు సహజం అని బీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షులు తట్టు నారాయణ యాదవ్‌ అన్నారు. జహీ రాబాద్‌ మండలంలోని లచ్చనాయక్‌ తాండా గ్రామ పంచా యతీలో జై సేవలాల్‌ గ్రామస్థాయి టెన్నిస్‌ బాల్‌ టోర్న మెంట్‌ విజేతలకు మెమొంటోను మంగళవారం అందించా రు. ఫైనల్‌ పోటీల్లో పట్లుర్‌ తాండాసీసీ జట్టు మరియు లచ్చ నాయక్‌ తాండా సీసీ మధ్య తలపడగా.. పట్లుర్‌ తాండా సీసీ జట్టు విజేతగా అవతరించింది. మ్యాన్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అల్రౌండర్‌ మున్నకు లభించగా, మ్యాన్‌ ఆఫ్‌ ది సిరీస్‌ స్టార్‌ అల్‌రౌండర్‌ విజరుకు ఇచ్చారు. ఈ సంద ర్భంగా ముఖ్య అతిధి తట్టు నారాయణ మరియు విశ్వనాథ్‌ మాట్లాడుతూ.. క్రికెట్‌ స్పుర్తిదాయకమైన ఆట అని, ఇక్కడ అంకితబవం, క్రమశిక్షణతో ఆడినవారు విజయం సాధిసా ్తరన్నారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని జహీరాబాద్‌ నియోజకవర్గంలోని క్రీడాకారులను ప్రోత్సహించేందుకు తమ వంతు కషి చేస్తామన్నారు. టోర్ని విజేత పట్లూరు తాండా సీసీ జట్టుకు రూ.35 వేల నగదుతో పాటు ట్రోఫీని తట్టు విశ్వనాథ్‌ యాదవ్‌ ఇవ్వగా, రన్నర్‌ జట్టు లచ్చనాయక్‌ తాండా సీసీ జట్టుకు రూ.20 వేల నగదుతో పాటు ట్రోఫీని మండల బీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు తట్టు నారాయణ చేతుల మీదుగా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ధన్‌సింగ్‌, మాజీ సర్పంచ్‌ జగదీశ్వర్‌, ఉప సర్పంచ్‌ తారసింగ్‌, మండల సోష ల్‌ మీడియా అధ్యక్షుడు విజరు రాథోడ్‌, బీఆర్‌ఎస్‌ గ్రామా ధ్యక్షుడు గొల్ల జగన్నాధం, గంట శ్రీనివాస్‌, తాలూకా గొల్ల కురుమ యాదవ యువజన సంఘం అధ్యక్షుడు రాజా రమేష్‌, తట్టు సాయి, నకుల్‌ చవాన్‌, రమేష్‌ ,బన్ను రిపోర్టర్‌ అబ్దుల్లా తదితరులు పాల్గొన్నారు.

Spread the love