పొడిబారిన జుట్టుకి కొబ్బరిపాలను పట్టిస్తే, అవి జుట్టుకు తిరిగి ప్రాణం వచ్చేలా చేస్తాయి. జుట్టు సాఫ్ట్‌గా మారుతుంది. కుదుళ్లు గట్టిపడతాయి. వెంట్రుకలు చిట్లిపోయే సమస్య తొలగిపోతుంది.
తాజా కొబ్బరి పాలను జుట్టు కుదుళ్లపై పోసుకొని మసాజ్ చేసుకోవాలి. ఇలా జుట్టు మొత్తం తగిలేలా చెయ్యాలి. ఓ అరగంట పాటూ అలా వదిలేయాలి. ఓ టవల్‌ని గోరు వెచ్చటి నీటిలో ముంచి తీసి నీటిని పిండేసి దాన్ని ఐదు నిమిషాల పాటు తలకు చుట్టుకోవాలి. టవల్ తీసి మళ్లీ గోరువెచ్చటి నీటిలో ముంచి నీటిని పిండేసి తలకు చుట్టుకోవాలి. ఇలా నాలుగైదు సార్లు చెయ్యాలి. తర్వాత జుట్టును కడిగేసుకోవాలి. ఫలితంగా సాఫ్ట్ అండ్ సిల్కీ హెయిర్ మీ సొంతం అవుతుంది. జుట్టులోని చుండ్రు దూరం అవుతుంది.
షాంపూతో తల స్నానం చేశాక, కొద్దిగా కొబ్బరి పాలను జుట్టుకి పట్టించాలి. రెండు నిమిషాలు అలా వదిలెయ్యాలి. తర్వాత నీటితో కడిగేసుకోవాలి. కండీషనర్‌లా కూడా కొబ్బరి పాలు ఉపయోగపడతాయి.
రెండు టీస్పూన్ల కొబ్బరి నూనె, ఓ టీస్పూన్ కొబ్బరి పాలను కలిపి మొహంపై నెమ్మదిగా మసాజ్ చేసుకోవాలి. కొన్ని నిమిషాల తర్వాత దూదితో తుడిచేసుకోవాలి. మీ చర్మం జిడ్డుగా, మచ్చలు, మొటిమలతో ఉంటే మీరు కూడా కొబ్బరి పాలను వాడవచ్చు. ఇందులో బ్యాక్టీరియాను చంపే గుణం ఉంటుంది.
ముసలితనం రాకుండా, ముడతలు రాకుండా, ఏజ్ స్పాట్స్ కనిపించకుండా చెయ్యడంలో కొబ్బరి పాలు బాగా ఉపయోగపడతాయి. అందువల్లే ఫేస్ మాస్క్‌లా కొబ్బరి పాలను వాడుతున్నారు. బాదం పొడి, కొబ్బరి పాలు, తేనె కలిపి ముఖానికి పేస్టులా పట్టించవచ్చు. కండ్లు, పెదవులకు మాత్రం అవసరం లేదు. 20 నిమిషాల తర్వాత నీటితో కడిగేసుకుంటే ముఖం కళకళలాడుతుంది.
నొప్పి, మంటలు ఉన్న చర్మంపై కొబ్బరి పాలు రాసుకుంటే ఎంతో హాయిని ఇస్తుంది.