స్ప్లాష్ కలర్స్ మీడియా, అలీనియ అవిజ్ఞ స్టూడియోస్, సెటిల్ కింగ్ ప్రొడక్షన్ నెం.1లో నిర్మాత వేణుబాబు ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఘంటసాల విశ్వనాథ్ దర్శకుడు. ఆదర్శ్ పుందిర్, అశ్రీత్ రెడ్డి, ప్రియాంక సింగ్, పూజిత పుందిర్, రాజ్ గౌడ్, సునందిని, మధుసూదన్ తదితరులు కీలక పాత్రధారులు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దర్శకుడు ఘంటసాల విశ్వనాథ్ మాట్లాడుతూ, ‘డిసెంబర్ 26న షూటింగ్ మొదలు పెట్టి, నిరంతరం పగలు రాత్రి తేడా లేకుండా 15 రోజులపాటు చేశాం. దీంతో 50 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యింది. మిగతా సగ భాగం షూటింగ్ కోసం యుఎస్ వెళ్తున్నాం. టెక్నాలజీ, ఎమోషన్, లింగ సమానత్వం పై ఉండబోతున్న ఈ చిత్రం ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు వచ్చేలా సన్నాహాలు చేస్తున్నాం’ అని తెలిపారు.
‘నాకు చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు. నా క్యారెక్టర్ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ రోజుల్లో ఇటువంటి సినిమాలు రావడం లేదు. ఈ సినిమా ఎంతో స్పెషల్‌గా ఉండబోతోంది’ అని నటి ప్రియాంక సింగ్ చెప్పారు. మరో నటి ఆదర్శ్ పందిరి మాట్లాడుతూ, ‘మేము కొత్త కామెడీతో ముఖ్యంగా లింగ బేధాల పై మంచి సినిమాతో ప్రేక్షకులు ముందుకు రానున్నాం. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది’ అని అన్నారు.