జై యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి క్రియేషన్స్ సమర్పణలో యస్.యం.కె.ఫిల్మ్స్ పతాకంపై మోహన్ కష్ణ, సౌజన్య, హరిణి రెడ్డి హీరో హీరోయిన్స్‌గా శ్రీ లక్ష్మణ్ దర్శకత్వంలో సింగూలూరి మోహన్ రావు నిర్మించిన చిత్రం ‘మోహన్ కృష్ణ గ్యాంగ్ లీడర్’. ఈ సినిమా విడుదలకు సిద్ధమైన సందర్భంగా సుమన్ మాట్లాడుతూ, ‘రైతులు ఇబ్బందులు పడుతున్న ఒక బర్నింగ్ సమస్యపై నా క్యారెక్టర్ ఉంటుంది. రైతు పాత్రలో నటించినందుకు చాలా హ్యాపీగా ఉంది.’ అని తెలిపారు. ‘రైతు మీద, ఫ్రెండ్స్ మీద, రాజకీయం, స్నేహం ఇలా ఐదు బర్నింగ్ ఇష్యుస్ గురించి ఈ సినిమాలో చూపించాం. ఇందులో ఉన్న ఆరు పాటలకు ఘన శ్యామ్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. ఐదు ఫైట్స్‌ను రామ్ సుంకర బాగా కంపోజ్ చేశారు. ఈ సినిమాను జూలై 7న గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం’ అని హీరో మోహన్ కష్ణ అన్నారు. దర్శకుడు శ్రీ లక్ష్మణ్ మాట్లాడుతూ, ‘రైతు గురించి మంచి కాన్సెప్ట్ తీసుకొని చేసిన ఈ సినిమా లో జై కిసాన్, జై జవాన్ అనే నినాదం ఎంత గొప్పదో ఈ చిత్రంలో చూడొచ్చు’ అని చెప్పారు.