ఆటపాటలతో..

With games..పసిపిల్లలు ఉన్న ఇంట్లో ఒకటే సందడి. పిల్లలు చేసే అల్లరితో పాటు వారితో సమానంగా పెద్దలు పిల్లలతో అడే అటలు, పాటలతో ఇల్లంతా సందడిగా ఉంటుంది. ఈ సందడి పిల్లలని ఉత్సాహ పరచటమే కాదు వారి శారీరక, మానసిక అరోగ్యానికి ఎంతో అవసరం. జోల పాటలు పాడుతూ పసిబిడ్డను కొద్దిగా అటూ, ఇటూ ఊపి చూడండి. వెంటనే అ పసి ముఖం మీద బోసినవ్వు మెరుస్తుంది. ఒకోసారి మన ఆటలకి నోరారా నవ్వుతారు. పకపకమని నవ్వేవారి నవ్వు చక్కటి ఆరోగ్యాన్ని అందిస్తుంది. అందుకే వీలయినంత ఎక్కువగా పిల్లల్ని ఆటపాటలతో మురిపించటం ఎంతో మంచిదని అంటున్నారు పరిశోధకులు.
పసి పిల్లల్ని ఎత్తుకుని పైకి ఎగరేస్తూ ఆడటం, అలాగే ఒళ్లో కూర్చో పెట్టుకుని పాటలు పాడుతూ ముందుకీ వెనక్కి ఊపుతూ ఆడించటం వంటివన్నీ పిల్లలకి కేవలం ఆటలాగా సరదాగా అని పిస్తాయి. కానీ, నిజానికి బిడ్డల్ని అలా అటూ, ఇటూ ఊపుతుండటం వల్ల ఎంతో లాభం ఉందని గుర్తించారు పరిశోధకులు. వీటి వల్ల వారి మెదడులో గణనీయమైన పెరుగుదల ఉంటుందని తేలింది. బిడ్డలకు సంగీతాన్ని వినిపిస్తూ ఇలా లయబద్ధంగా ఊపటం వల్ల వారి మెదడులో ‘సెన్సరీ వ్యవస్థ’ చక్కగా బలపడుతోందని, దీని వల్ల నాడీ కణాల మధ్య అనుసంధాయక సంబంధాలు అంటే నాడీ వ్యవస్థ మెరుగై, మెదడు చురుగ్గా అభివద్ధి చెందుతోందని పరిశోధకులు గుర్తించారు.
పసిపిల్లల్ని అడించేటప్పుడు అల్లిబిల్లి పాటలు పాడటం, అందుకు తగ్గట్టు లయాత్మకంగా ఊపటం అన్ని సమాజాలల్లోనూ, అన్ని సంస్కతు ల్లోనూ ఉంది. అలాగే లాలి పాటలు పాడుతూ ఒళ్లో వేసి ఊపుతూ జో కొట్టటం కూడా. వీటి ప్రభావం పిల్లల ఎదుగుదలపై ఎలా ఉంటుందన్న దాని మీద పరిశోధకులు విస్తతంగా చేసిన పరిశోధనల్లో తెలిసీ, తెలియక మనం ఆడించే ఈ ఆటల వల్ల పిల్లల మెదడుకి ఎంతో మేలు కలుగుతుందని వెల్లడైందట..
చిట్టిపొట్టి గీతాలు, పాటలు పిల్లలకి చిన్నితనం నుంచే వినిపి స్తుండటం వల్ల వారిలో రకరకాల సామర్ధ్యాలు చురుకుగా అభివద్ధి చెందటం గమనించారు. భాషా పరిజ్ఞానం, జ్ఞాపక శక్తీ వంటివే కాదు పంచేంద్రియాలు అంటే సెన్సస్‌ చురుకుగా తయారై మెదడు మరింత చురుకుగా వద్ధి చెందుతుందని వీరు చెబుతున్నారు. మనం ఏదైనా అనుభూతి పొందుతున్నామంటే, దాని వెనుక ఏకకాలంలో రకరకాల జ్ఞానేంద్రియాలు పనిచేస్తున్నాయని అర్థం. ఎదుగుదలలో భాగంగా పిల్లలకు ఈ భిన్నత్వం అలవాటు అయ్యేందుకు మన అటా – పాటా బాగా ఉపకరిస్తాయంటున్నారు.
పిల్లల్ని ఒకచోట ఉంచి, రకరకాల బొమ్మల్ని చూపిస్తూ అడించిన దాని కన్నా, పిల్లల్ని ఒక బొమ్మగా ఆడించి, ఊపుతూ కదపటం, వారు కిలకిలా నవ్వేలా చేయటం వంటివి తప్ప కుండా వారి మెదడులోని నాడీకణాల మధ్య అనుసంధాన సంబంధాలు మెరుగు పడటానికి ఉపయోగపడుతుందట. కాబట్టి అటపాటలతో, లాలి పాటలతో లయబద్ధంగా పిల్లల్ని ఊపుతూ అడించటం ఎంతో మంచిది అంటున్నారు పరిశోధకులు.

Spread the love