ఎంఎంటీఎస్‌ పొడిగింపుతో

– టెంపుల్‌ టౌన్‌ స్టేషన్‌కు మెరుగైన సేవలు
– యాదాద్రి రైల్వేస్టేషన్‌ తనిఖీలో దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రైల్వే శాఖ చేపట్టిన ముఖ్యమైన ప్రాజెక్ట్‌లో భాగంగా ఎంఎంటీఎస్‌ పొడిగింపుతోపాటు యాదాద్రి స్టేషన్‌ అభివద్ధి పనులను కూడా చేపడుతున్నామని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌కుమార్‌ జైన్‌ అన్నారు. ఈ రెండు పనులను పూర్తి చేయడం వల్ల రైలు ప్రయాణీకులకు ముఖ్యమైన టెంపుల్‌ టౌన్‌ స్టేషన్‌(యాదాద్రి)కు మెరుగైన ప్యాసింజర్‌ సేవలు, ఆదనపు రైలు ఆనుసంధానమూ లభిస్తుందని అన్నారు. గురువారం యాదాద్రి రైల్వే స్టేషన్‌ను తనిఖీ చేసిన ఆయన ప్రతిపాదిత ఎంఎంటీఎస్‌ రెండో దశ ప్రాజెక్టు యాదాద్రివరకు పొడిగింపుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా అరుణ్‌కుమార్‌ మాట్లాడుతూ 2016-17లో రూ.330 కోట్ల అంచనా వ్యయంతో ఘట్‌కేసర్‌ నుంచి యాదాద్రి వరకు ఎంఎంటీఎస్‌ ఫేజ్‌-2 పొడిగింపునకు కేంద్రం అనుమతిచ్చిందని తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌లో ప్రస్తుతమున్న ఘట్‌కేసర్‌, యాదాద్రి(రాయగిరి) మధ్య 33 కి.మీల దూరం వరకు ఉన్న రెండు లైన్లు కాకుండా ఆదనంగా మరో లైన్‌ను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ఘట్‌కేసర్‌, బీబీనగర్‌, భువనగిరి, యాదాద్రి స్టేషన్‌లు, యార్డుల్లో అదనపు మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ప్రాజక్టును ఆర్‌వీఎన్‌ఎల్‌ ఆధీనంలో నిర్మిస్తున్నామని చెప్పారు. వాస్తవానికి ఈ ప్రాజెక్టును మొదట రైల్వేలు, ప్రభుత్వం మధ్య జాయింట్‌ వెంచర్‌గా రూపొందించామన్నారు. కానీ ప్రస్తుతం ప్రాజెక్ట్‌ కోసం సవరించిన అంచనా సుమారు రూ.430 కోట్లకు చేరిందన్నారు. అందువల్ల ఇప్పుడు రైల్వే బోర్డు 100శాతం రైల్వే నిధులతో ప్రాజెక్టును అమలు చేసేందుకు నిర్ణయించిందని తెలిపారు.
హైదరాబాద్‌ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌గా లోకేష్‌విష్ణోరు
దక్షిణ మధ్య రైల్వేలోని హైదరాబాద్‌ డివిజన్‌, డివిజనల్‌ రైల్వే మేనేజర్‌గా లోకేష్‌ విష్ణోరు గురువారం బాధ్యతలను స్వీకరించారు. అయన ఇండియన్‌ రైల్వేస్‌ సర్వీస్‌ ఆఫ్‌ సిగల్‌ ఇంజనీర్స్‌ (ఐఆర్‌ఎస్‌ఎస్‌ఈ) 1992 బ్యాచ్‌కి చెందినవారు. ఎలక్ట్రానిక్స్‌ ఇంజనీరింగ్‌లో బ్యాచిలర్స్‌ డిగ్రీతో పాటు ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌లో పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ డిప్లొమా కూడా కలిగి ఉన్నారు . ప్రస్తుత నియామకానికి ముందు, లోకేష్‌విష్ణోరు సౌత్‌ ఈస్ట్‌ సెంట్రల్‌ రైల్వేలోని రారుపూర్‌ డివిజన్‌లో అదనపు డివిజనల్‌ రైల్వే మేనేజర్‌గా పనిచేశారు.

Spread the love