మహిళల ఆత్మ గౌరవంతో..

 of women With respectఏనుగంటి ఫిలిం జోన్‌ బ్యానర్‌ పై దర్శక-నిర్మాత లక్ష్మణ్‌ చిన్నా ప్రధాన పాత్ర పోషిస్తూ, స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘నచ్చినవాడు’. ఈ నెల 22న ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటకలో కూడా విడుదలకు రెడీగా ఉంది. ఈ సందర్భంగా దర్శకుడు లక్ష్మణ్‌ చిన్నా మాట్లాడుతూ,’ స్త్రీ ఆత్మ గౌరవం ప్రధాన ఇతివత్తంగా దీన్ని తెరకెక్కించాను. మిజో జోసెఫ్‌ అందించిన సంగీతం, హర్షవర్ధన్‌ రెడ్డి అందించిన సాహిత్యం, జావేద్‌ అలీ, యాజిన్‌ నిజార్‌, సైనోరా పాడిన పాటలు ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. ఆదిత్య మ్యూజిక్‌ ద్వారా రిలీజైన మా ఆల్బమ్‌ యూట్యూబ్‌లో విశేష ప్రేక్షకాదరణ పొంది, సూపర్‌హిట్‌ అయ్యింది. కొత్త తరం నటీనటులను ప్రోత్సహించాలనే సంకల్పంతో తెలుగు, కన్నడ నటీనటులకు ఇందులో అవకాశం ఇచ్చాను. కర్ణాటక, పాండిచ్చేరి, గోవా వంటి తదితర ప్రాంతాల్లో షూటింగ్‌ చేశాం. నేటి యువతరానికి, ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చే విధంగా ఈ చిత్రం ఉంటుంది’ అని చెప్పారు.

Spread the love