ఎయిర్‌పోర్ట్‌లో రూ.9.67 లక్షల విదేశీ కరెన్సీ పట్టివేత … మహిళ అరెస్ట్‌

నవతెలంగాణ-శంషాబాద్‌
అనుమతులు లేకుండా విదేశీ కరెన్సీని హైదరాబాద్‌ నుంచి విదేశా లకు అక్రమంగా తీసుకెల్తున్న మహిళ ను శంషా బాద్‌ రాజీవ్‌గాంధీ ఇంటర్నే షనల్‌ ఎయిర్‌పోర్టులో అదికారులు శనివారం తెల్లవారు జామున అడ్డుకున్నారు. బిహే వియర్‌ డిటెక్షన్‌, సిఐఎస్‌ఎఫ్‌/ జిడి సిఐడబ్ల్యూ స్టాప్‌ మాజీ ఏఎస్‌ఐ సంపత్‌ రావు, సిటీ/జీడి షేక్‌ జానీ బాబు తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌ జహనుమ ప్రాంతానికి చెందిన మహిళ జిల్‌ ఆల్నిసా మహ్మద్‌ ఖమర్‌ అల్దీన్‌ హైదరాబాద్‌ ఆర్‌జీఐ ఎయిర్‌పోర్టు నుంచి యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ విమానంలో షార్జా వెళ్లడానికి ఎయిర్‌పోర్ట్‌కు వచ్చారు. ఎయిర్‌ పోర్ట్‌లో ఆమెను పరిశీలించిన అధికారులు బ్యాగును తనిఖీ చేశారు. ఆ బ్యాగు లో విదేశీ కరెన్సీ కనిపించింది. విదేశీ కరెన్సీని బయటకు తీసి లెక్కించారు. ఆమె యునైటెడ్‌ ఎమిరేట్స్‌ దిరమ్స్‌ 44,480ను 54 నోట్ల కట్టలుగా మార్చుకుని బ్యాగులో దాచారు. వాటి విలువ భారత కరెన్సీ ప్రకారం రూ.9 లక్షల 67వేల 440 ఉంటుందని అంచనా వేశారు. కరెన్సీని స్వాధీనం చేసుకున్న అధికారులు మహిళను అదుపులోకి తీసుకున్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Spread the love