
– ఒంటిపై డీజిల్ పోసుకున్న మహిళా
– ఆస్తి తగాదాలే కారణం
– కోర్టులో కేసు కొనసాగుతుండగానే భూమి విక్రయం
– ఆస్తి మొత్తం రెండో భార్యకే ఇస్తున్న భర్త
– బాధిత మహిళను పోలీస్ స్టేషన్ కు తరలింపు
– కౌన్సిలింగ్ నిర్వహించి పంపించిన పోలీసులు
నవతెలంగాణ-రంగారెడ్డి ప్రతినిధి : ఇబ్రహీంపట్నం కోర్టు ఆవరణలో ఓ మహిళ ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించింది. నిప్పుటించుకునే ప్రయత్నం చేస్తుండగా సమీపంలో ఉన్న వారు అడ్డుకున్నారు. ఆమె ఆత్మహత్యాయత్నానికి కుటుంబ ఆస్తి తగాడాలే కారణమని పోలీసులు వెల్లడించారు. ఆమెను పోలీసులు అదుపులోకి తీసుకొని ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ కు తరలించారు. అందుకు సంబంధించిన వివరాలు.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం పరిధిలోని యాచారం మండలం మంతన్ గౌరెల్లి గ్రామానికి చెందిన జర్పుల భద్రియ, కమలబాయి అనే దంపతులకు గత కొన్నాళ్లుగా ఆస్తి గొడవలు కొనసాగుతున్నాయి. వీరికి ఒక కొడుకు, ఇద్దరు ఆడపిల్లలున్నారు. వీరూ అన్యోన్యంగా ఉన్న సమయంలో కొన్నాళ్లు ఉపాధి కోసం నగరంలో నివాసం ఉంటూ చిన్నా.. చితికా పనులు చేసుకుని జీవనం సాగించేవారు. ఈ క్రమంలో కమలబాయి భర్త బద్రీయ తరచుగా తన స్వగ్రామమైన మంతన్ గౌరెల్లికి వచ్చి పోతుండేవారు. ఈ క్రమంలో పద్మ అనే మరో మహిళతో పరిచయం ఏర్పడింది. ఆమెను రెండో వివాహం చేసుకున్నాడు. కానీ మొదటి భార్య కమలబాయికి విడాకులు ఇవ్వకుండానే పద్మను రెండో వివాహం చేసుకోవడంతో ఇరువురి మధ్య గొడవలు చోటు చేసుకున్నాయి. అప్పటి నుంచి తన ముగ్గురు పిల్లలతో మొదటి భార్య కమలబాయి నగరంలో ఉంటూ రోజువారి కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తుంది. రెండో భార్య పద్మకు ముగ్గురు ఆడపిల్లలు కలిగారు. పెద్దకూతురు వివాహం జరిగింది. రెండవ కూతురు 30 ఏళ్లు దాటిన వివాహం చేసేందుకు చిల్లి గవ్వలేదు. కొడుకు చిన్నోడు. అయితే తన భర్త బద్రీయ రెండో వివాహం చేసుకున్న పద్మకు ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు వారి వివాహం భడ్రియనే ముందుండి చేశాడు. రెండో భార్య పిల్లలను గాలికి వదిలేసాడు. దాంతో భద్రియా పేరుతో ఉన్న ఆస్తిపై
రెండో భార్య కమలబాయి ఆస్తికోసం పెద్దలను కలిసింది. వారీ నుండి ఎలాంటి న్యాయం లభించకపోవడంతో కోర్టును ఆశ్రయించింది. అతని పేరుతో ఉన్న రెండు ఎకరాల భూమిలో వాటా కోసం మొదటి భార్య జర్పుల కమలబాయి ఇబ్రహీంపట్నం కోర్టులో 2021లో కేసు వేసింది. ఈ కేసు కోర్టు పరిధిలో కొనసాగుతుంది. కోర్టులో కేసు కొనసాగుతుండగానే భర్త జర్పుల బద్రియ తన రెండో భార్య పద్మతో కలిసి ఇప్పటికే 20 గుంటల భూమిని విక్రయించాడు. మరో ఎక్కరా భూమిని కూడా ఇతరులకు విక్రయించేందుకు బేర సారాలు కుదుర్చుకున్నాడు. ఓవైపు కేసులు కోర్టులో కొనసాగుతుండగానే భూమి విక్రయాలు జరపడం ఏమిటని తను నియమించుకున్న అడ్వకేట్లను కూడా ప్రలోభాలకు గురి చేస్తూ కేసును నిర్వీర్యం చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని కమలబాయి ఆందోళన వ్యక్తం చేసింది. కొన్నాళ్లు కేసును నడిపించిన తమ అడ్వకేట్లు తర్వాత కేసు నుంచి తప్పుకుంటున్నారని ఆందోళన వెలిబుచ్చింది. చేసేది లేక ఇబ్రహీంపట్నం కోర్టు ఆవరణలో సోమవారం ఒంటిపై డీజిల్ పోసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ఆమెను వెంటనే చుట్టుపక్కల వారు అడ్డుకున్నారు. ఇబ్రహీంపట్నం పోలీసులకు సమాచారం అందించారు. ఇబ్రహీంపట్నం పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కి తరలించారు. అడ్వకేట్లు అన్యాయం చేస్తున్నారని భావిస్తే.. బార్ అసోసియేషన్ లో ఫిర్యాదు చేయాలని ఆమెకు కౌన్సిలింగ్ నిర్వహించారు. న్యాయస్థానంలోనే చట్టపరంగా కొట్లాడాలని సూచించారు. కోర్ట్ తీసుకునే నిర్ణయమే తుది నిర్ణయమని.. ఇందులో పోలీసులు జోక్యం చేసుకోబోరని ఆమె సూచించారు.