వివాహ విందు భోజనం తిని మహిళ మృతి..

నవతెలంగాణ-హైదరాబాద్ : సంతోషంగా వివాహ సంబరాలు చేసుకుంటున్న సమయంలో విషాదం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీకాకుళం  జిల్లా మందస మండలం నల్లబొడూరులో ఓ ఇంట వివాహం జరిగింది. ఈ సందర్భంగా శనివారం బంధువులకు, మిత్రులకు వివాహ విందు భోజనం ఏర్పాటు చేశారు. విందుకు వచ్చిన బంధువులు భోజనం చేసిన కొద్ది సేపటికే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వీరిలో మహిళ మృతి చెందగా మరో 10 మంది అస్వస్థకు గురయ్యారు. వీరిని హరిపురం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. వండిన ఆహారం కలుషితం కావడం వల్లే అస్వస్థతకు గురయ్యారని వైద్యులు ప్రాథమికంగా అంచనా వేశారు.

Spread the love