చిరుతపులి దాడిలో మహిళ మృతి..

నవతెలంగాణ-హైదరాబాద్ : ఏపీలోని ప్రకాశం జిల్లాలో కట్టెల కోసం అడవిలోకి వెళ్లిన మహిళపై చిరుతపులి దాడి చేసి చంపేసింది. నంద్యాల-గిద్దలూరు మార్గంలో ఈ ఘటన జరిగింది. మృతురాలిని పచ్చకర్లకు చెందిన మెహరున్నీసాగా గుర్తించారు. చిరుత కలకలంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

Spread the love