బతుకమ్మ ఆట ఆడుతున్న మహిళ డాక్టర్లు

– ఐఎంఏ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు
నవతెలంగాణ జమ్మికుంట
జమ్మికుంట పట్టణంలో సోమవారం ఐఎంఏ హుజురాబాద్ జమ్మికుంట అధ్యక్షులు అంకం సుధాకర్ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ప్రకృతిలో దొరికే రంగురంగుల పూలను గునుగు తంగేడు కట్ల పూలు గుమ్మడి పూలు బంతి ప్రకృతిని దొరికే రంగురంగుల పూలతో బతుకమ్మను పేర్చి మహిళ డాక్టర్లు బతుకమ్మ ఆటను ఆడి పాడారు. కోలాటాలు చేశారు. ఈ సందర్భంగా ఐఎంఏ హుజురాబాద్, జమ్మికుంట అధ్యక్ష కార్యదర్శులు అంకం సుధాకర్ ఉడుగుల సురేష్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం బతకమ్మ పండుగను అధికారికంగా నిర్వహించడం ఎంతో అభినందనీయమన్నారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు బతుకమ్మ పండుగ ప్రతీక అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎంఏ మాజీ అధ్యక్షులు డాక్టర్ ముక్క రాము, డాక్టర్లు ఓ ల్లాల రాణి, ముక్క శ్రీవాణి, ఉడుగుల అనిత, ముషం ప్రణీత, లావణ్య, పద్మజ, ప్రశాంతి ,ఆమని, స్వర్ణ, హిందూ, హరిత తదితరులు పాల్గొన్నారు.
Spread the love