చెరువులో మునిగి మహిళ అనుమానాస్పద మృతి

నవతెలంగాణ-తలకొండపల్లి: మండల కేంద్రంలో సమీపంలో ఉన్న లింగాయ కుంట చెరువులో సోమవారం రాత్రి అనుమానాస్పదంగా పెరమండ్ల శాంతమ్మ(48) అనే మహిళ మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. తలకొండపల్లి ఎస్సై సిహెచ్ శ్రీనివాస్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తలకొండపల్లి గ్రామానికి చెందిన సోమవారం కనిపించకుండా పోయిన శాంతమ్మ మంగళవారం ఉదయం చెరువులో మునిగి మృతి చెందినట్లు గుర్తించారు. మృతురాలి సోదరుడు రాములు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవాన్ని కల్వకుర్తి పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు తెలిపారు. మృతి చెందిన శాంతమ్మ మానసికంగా శారీరకంగా వికలాంగురాలని పేర్కొన్నారు, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తామని ఎస్సై సిహెచ్ శ్రీనివాస్ తెలిపారు.

Spread the love