30 కుటుంబాలకు నిత్యావసరాల పంపిణీ చేసిన మహిళలు

నవతెలంగాణ -గోవిందరావుపేట
మండలంలోని పసర గ్రామంలోని ఎస్సీ కాలనీలో  ఇటీవల వరదల వల్ల సర్వం కోల్పోయిన 30 కుటుంబాలకు మంగళవారం గ్రామానికి చెందిన పలువురు మహిళలు స్వచ్ఛందంగా నిత్యవసరాలైన వంట సరుకులు కొని పంపిణీ చేశారు. పసర గ్రామానికి చెందిన యాస పూలమ్మ, సామ సరోజన, వెలిశాల ధనమ్మ, కొడిమాల జ్యోతి, కుంట వసుధ, మాచర్ల రజిత, మెస్ విజయ్ కుమారి, నిమ్మల సుహాసిని, పిట్టల భాగ్యలక్ష్మి, ముండ్రాతి సరిత, సామ సమ్మక్కలు ఆర్థికంగా తలా కొంత డబ్బులు జమ చేసుకొని వరద బాధితులను ఆదుకోవాలని ఉద్దేశ్యంతో 30 కుటుంబాలకు నిత్యావసరాలను పంపిణీ చేసినట్లు మహిళలు తెలిపారు. గ్రామంలో మహిళలు చేసిన ఈ సేవా కార్యక్రమాన్ని పలువురు అభినందిస్తున్నారు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని మరి కొంతమంది ముందుకు వచ్చి వరదల్లో సర్వం కోల్పోయిన కుటుంబాలకు హితోదికంగా సహాయం అందించాలని సూచిస్తున్నారు. అంతేకాక పలువురు మహిళా సంఘాల సభ్యులు కూడా వరద బాధితులకు సహాయ సహకారాలు అందించాలని గ్రామానికి చెందిన పలువురు అభిప్రాయపడుతున్నారు.
Spread the love