పురుషులతో సమానంగా స్త్రీలు: జెడ్పీ ఛైర్ పర్సన్ రోజా శర్మ

– ఆడవారి విజం వెనకాల మగవారు

– మున్సిపల్ ఛైర్ పర్సన్ మంజుల
పీఆర్ టీయూ టి ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
నవతెలంగాణ – సిద్దిపేట
పురుషులతో సమానంగా స్త్రీలు ఉన్నప్పుడే సమాజం కూడా అభివృద్ధి చెందుతుందని జడ్పీ చైర్ పర్సన్ రోజా శర్మ అన్నారు. జిల్లా కేంద్రంలోని విపంచి కళానిలయంలో పి ఆర్ టి యు టి ఎస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి మహిళ ఆరోగ్యవంతంగా ఉండాలని అప్పుడే తన కుటుంబాన్ని కూడా ఆరోగ్యంగా ఉంచుకుంటుందని అన్నారు. ఒక గంట సేపైనా తమ ఆరోగ్యం కోసం కేటాయించుకోవాలని సూచించారు. జిల్లా ఏర్పాటు మూలంగానే తాను మొదటి జడ్పీ చైర్ పర్సన్ గా అవకాశం వచ్చింది అన్నారు. ఉద్యోగ మహిళలు రెండు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందన్నారు. కుటుంబాన్ని, ఉద్యోగ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని అన్నారు. ఆడవారి విజయం వెనక మగవారు ఉంటారని మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల అన్నారు. ఎక్కడ మహిళలు  పూజించబడతారో అక్కడ దేవతలు తిరుగుతారని నమ్మే భారతదేశంలో మనం పుట్టడం సంతోషం అన్నారు. పి ఆర్ టి యు బాధ్యులు శశిధర్ శర్మ,  ఇంద్రసేనారెడ్డి, విజయలు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో పి ఆర్ టి యు ఎప్పుడు ముందు ఉంటుందన్నారు. మహిళల సమస్యల పరిష్కారం కోసం అనేక జి ఒ లను తెచ్చిన ఘనత పి ఆర్ టి యు కే  దక్కిందన్నారు.  సంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి మహిళా ఉపాధ్యాయురాలుకి ఎమ్మెల్సీ కూర రగోతంరెడ్డి గిఫ్ట్ లను అందించారు. ఈ మధ్యనే ఐదు ఉద్యోగాలను సాధించిన మృణాళిని ని పిఆర్టియు ఘనంగా సన్మానించారు. అనంతరం ప్రతినిధులను పి ఆర్ టి యు వారు శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో గంగా రగోతం రెడ్డి, పి ఆర్ టి యు ప్రతినిధులు రజిత, వెంకటరాజ్యం, సురేందర్ రెడ్డి, ముక్తేశ్వరి, సుజాత , రమ, మాలతి, మాధవి, అరవింద, జ్యోతి, తదితరులు పాల్గొన్నారు.
Spread the love