నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజరుకుమార్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్ అయింది. ఇలాంటి వ్యాఖ్యలు మరో చేయోద్దంటూ మందలించింది. శనివారం అయన మహిళా కమిషన్ ముందు హాజర య్యారు. మహిళల పట్ల పలు సందర్భాల్లో బండి సంజరు చేసిన అనుచిత వ్యాఖ్యలను, సంబంధిత వీడియోలను ప్రదర్శించిన మహిళ కమిషన్ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవితపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై బండి సంజరు.రాత పూర్వకంగా వివరణ ఇచ్చినట్టు తెలిసింది. మరోసారి సంజరుని కమిషన్ విచారించే అవకాశముందని తెలిసింది. కాగా మహిళలపై మరోసారి సామెతలను ప్రయోగించొద్దంటూ కమిషన్ ఆయన్ను హెచ్చరించనట్టు తెలిసింది.