నవతెలంగాణ-హైదరాబాద్ : ప్రముఖ జ్యోతిషుడు వేణుస్వామికి తెలంగాణ మహిళా కమిషన్ నోటీసులు పంపింది. నాగచైతన్య-శోభిత ధూళిపాళ విడిపోతారంటూ ఆయన జాతకం చెప్పడాన్ని తప్పుబడుతూ ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్, తెలుగు ఫిలిం డిజిటల్ మీడియా అసోసియేషన్ TGSCWకి ఫిర్యాదు చేసింది. ఈక్రమంలో ఈనెల 22న ఆయన వ్యక్తిగతంగా కమిషన్ ముందు హాజరుకావాలని ఛైర్‌పర్సన్ నేరెళ్ల శారద సమన్లు జారీ చేశారు.