‘మహిళలు – కాల్పనిక సాహిత్యం’ వర్జీనియా వూల్ఫ్‌ స్త్రీ వాద దృక్పథంపై పరామర్శ

(Ouse)ARoom of One’s Own’ non -fiction statement’. వర్జీనియా వూల్ఫ్‌ తన ప్రసంగాలను పుస్తకంగా తీసుకొచ్చిన Non-Fiction నవలగా ప్రసిద్ధి పొందింది. ‘జెండర్‌ – కాల్పనిక రచనలు’ అనే విషయం మీద వూల్ఫ్‌, పురుష రచయితల మీద చేసిన వ్యాఖ్యానమా? సాహిత్యంలో స్త్రీలకు సంబంధించిన విషయాలను స్త్రీలే స్పష్టంగా, నిజాయతీగా భావ ప్రకటన చేయగలరని చెప్పిన స్త్రీవాదియా? ఈ రచనను ఏ దష్టితో చూడాలి? ‘ఫెమినిస్ట్‌ మేనిఫెస్టో’ గానా లేదా ‘సాహిత్య విమర్శ’గానా? వూల్ఫ్‌ తాను 1928, అక్టోబర్‌ నెల 20, 26 తేదీలలో కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయానికి చెందిన Newnham, Girton మహిళా కళాశాలల ప్రాంగణాలలో ప్రసంగించిన వ్యాసాలకు మరికొన్ని విషయాలను జోడించి సెప్టెంబర్‌, 1929 లో ‘A Room of One’s Own శీర్షికతో గ్రంథ ప్రచురణ కావించింది. ఈ ప్రసంగాలలో, మహిళలు రచనలు చేయాలంటే వారికి ఆర్థిక స్వాతంత్య్రం, ప్రత్యేకమైన గది అవసరమన్న విషయాన్ని బలంగా వినిపిస్తుంది. ఇది చాలా చిన్న విషయమే! ‘స్త్రీ వాస్తవిక స్వభావం వెలుగులోకి రావాలన్నా, స్త్రీకి సంబంధించిన అంశాలతో, వాస్తవాలతో కూడుకున్న సాహిత్యం కావాలన్నా ఈ చిన్న విషయాలను పరిగణనలోకి తీసుకుంటే గాని సమస్యలకు సమాధానం దొరకదు’ అని వర్జీనియ తన వాదాన్ని స్పష్టంగానే వినిపిస్తుంది. ఈ పుస్తకంలో ‘మహిళలు-కాల్పనిక సాహిత్యం’ అనే అంశం మీద వర్జీనియా వూల్ఫ్‌ చాలా సుదీర్ఘమైన చర్చ చేస్తుంది. Women and Fictionμ అంశాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? మహిళ అనే పదాన్ని ఎలా అవగాహనలోకి తీసుకోవాలి? మహిళ అంటే ఏమిటి? ఆమె శారీరక, మానసిక స్థితియా? సమాజం, కుటుంబ వ్యవస్థలలో ఆమె స్తానం ఏమిటి? మహిళలో సాహిత్యాన్ని సష్టించే సామర్ధ్యం ఉన్నదా? సజనాశక్తి కలిగి వున్నదా? ఇలా అనేక ప్రశ్నలు తన ప్రసంగాల చర్చల్లో కనబడతాయి. వీటి గురించి చర్చిస్తూ ఈ అంశాలపై స్పష్టత కావాలంటే ముందుగా మహిళలు రచనా రంగంలోకి రావాలని, రచనల ద్వారా తమ అంతరంగాన్ని ఆవిష్కరించాలని కోరుకుంటుంది. ఆక్స్‌ బ్రిడ్జ్‌ (Oxbridge) పరిధిలోని కళాశాలలో తనకు ఎదురైన చేదు అనుభవాలను తన వాదనకు బలంగా తీసుకుంటుంది. నవలా రచయిత్రులు శతాబ్దాల నుండి రాస్తున్నా, వారి ప్రస్తావన రాకుండా చీకటిలోనే ఉండిపోవడం, వారి రచనల దుస్థితికి కారణాలు వెతుకుతుంది. ఎందుకు వెనక బడిపోయారు? అంటే కేవలం వారికి ఆర్ధిక స్వాతంత్య్రం లేకపోవడమనే అంటుంది. అలాగే intellectual freedom లేకపోవడం అంటుంది. తన ప్రసంగాలలో పురుష రచయితలు ఏ విధంగా చరిత్ర నుండి మహిళలను దూరంగా ఉంచారో, సామాజికంగా, రాజకీయంగా మహిళలను ఏ విధమైన లైంగిక వివక్షకు గురిచేశారో అన్న విషయాలను చర్చిస్తుంది. పురుషాధిపత్యంపై, స్త్రీలను second class citizen చూడటంపై విమర్శలు చేస్తుంది. విశ్వవిద్యాలయం ఆవరణలోని గ్రంథాలయం, వీబరవబఎ లాంటి ప్రధాన భవనాలలోకి మహిళల ప్రవేశం నిషిద్ధం లేదా నియంత్రణలపై, భవనం ప్రవేశ దారులపై పరచియున్న గడ్డి తివాచీలMuseum పై మహిళలు నడవడానికి వీలు లేదని అభ్యంతరం చెప్పినప్పుడు ఆమె తీవ్రమైన విభ్రాంతికిలోనై మనోవేదనకు గురవుతుంది. అంతే కాదు గ్రంథాలయంలోకి కూడా ఆమె ప్రవేశానికి అక్కడి అధికారులు, చర్చి పెద్దలు అభ్యంతరం తెలపడం సహించలేకపోతుంది.
పురుషుల ఫిక్షన్‌-నవలా రచనల్లో మహిళల పట్ల ద్వైదీభావం వ్యక్తమవుతూ ఉంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తూ వారి రచనల్లో మహిళలను ఏవిధంగా చిత్రీకరిస్తారో తెలుపుతుంది : ‘సమాజానికి, కుటుంబానికి అతి ముఖ్యమైన వ్యక్తి, బహువిధాలుగా సమర్ధురాలు, నాయకత్వ లక్షణాలతో కుటుంబాన్ని నెట్టుకొస్తుంది’ అంటూనే తక్కువ స్థాయి ఆలోచనలతో, స్వార్ధంతో మహిళ ఉంటుందంటారు. ఒకవైపు ఆమె ఉదాత్తతను ప్రస్తావిస్తూనే, దుష్టస్వభావి అని, అందమైనది కానీ వంచకురాలు, మోసపూరిత స్వభావం కలది, నిజాలను దాస్తుందంటూ చిత్రీకరిస్తారు. ఆమెను ఒక విలాస వస్తువుగా చూస్తారు. స్త్రీలను గదిలో బంధించి కొడతారు. పీడనకు, శోషణకు గురి చేస్తారు. కాల్పనిక సాహిత్యంలో ఆమెది ప్రధాన పాత్ర. కానీ చరిత్ర హీనురాలు, చరిత్రలో ఆమెకు ప్రాముఖ్యత లేదు. కవిత్వం మొత్తం విస్తరించి వుంటుంది కానీ, చరిత్రలో ఎక్కడా కనబడదు. ప్రతి ముఖచిత్రంపై ఆమె బొమ్మనే ఉంటుంది. కథల్లో రాజులపై తనదే ఆధిక్యం, కానీ నిజజీవితంలో ఒక మగవాడికి బానిస. ఇలా వర్జీనియా వూల్ఫ్‌ తన ప్రసంగంలో, తన రచనల్లో తాను గమనించిన విషయాలను నిర్భయంగా అందరి ముందు పెడుతుంది.
తన రచనయైన ఒక నాటకంలో షేక్స్‌పియర్‌కు స్వయాన సోదరియైన జుడిత్‌ పేరుతో ఒక కల్పిత పాత్రను సష్టిస్తుంది. ‘షేక్స్‌పియర్‌ తన మేధస్సుతో గొప్ప రచనలను సష్టించినప్పుడు, అదే ‘DNA’ కలిగిన జుడిత్‌ ఎందుకు సాహిత్య సజన చేయలేక పోయింది’ అన్న సందేహం కలిగినపుడు దానికి ఆమె, జుడిత్‌ మహిళ కావడం వల్ల ఆమెను పని మనిషిలా చూస్తూ ఇంటి పనులకు మాత్రమే పరిమితం చేయడం, ఇంటి నుండి బయటికి రాకుండా ఉంచడం లాంటి విషయాలను ప్రస్తావిస్తూ ఆమె సజనాత్మక శక్తిని నాశనం చేశారని, పురుష సమాజాన్ని విమర్శిస్తుంది. తన పుస్తకంలో 17వ శతాబ్దికి చెందిన Aphra Behn 19వ శతాబ్దికి చెందిన George Eliot, Jane Austen, Charlotte Bronte, Emilie Bronte లాంటి మహిళా రచయిత్రుల గురించి చర్చిస్తుంది. తన రచనలను ఎవ్వరి కంటపడకుండా blotting paper తో కప్పి వుంచి Austen  జాగ్రత్త పడేదని చెబుతుంది. Brontes, George Eliot ల స్థితిని వివరిస్తుంది. వారు మగవారి శైలిలోనే రాసారని విమర్శిస్తోంది.Jane Austen  మాత్రమే ఇందుకు మిహాయింపు. మేధోపరంగా అంత తెలివి లేకున్Austen  వారిద్దరికన్నా విజయాన్ని సాధించింది. 19వ శతాబ్ది రచయిత్రులు, 20వ శతాబ్ది ప్రథమార్ధంకు చెందిన రచయిత్రుల రచనలలోని వైవిధ్యాలను, వైరుధ్యాలను ప్రస్తావిస్తుంది.
18వ శతాబ్ది ముందు ‘ఇంగ్లాండ్‌ చరిత్ర కేవలం పురుషుల చరిత్ర గానే పరిఢవిల్లింది, స్త్రీల విషయాన్ని పరిగణనలోకి తీసుకోలేదు. షేక్స్‌పియర్‌ కాలంలో, మిల్టన్‌ కాలంలో, జాన్సన్‌ కాలంలో స్త్రీల పరిస్థితి ఏమిటి? అని ఒకసారి చరిత్ర తిరిగేయండి’ అని ప్రశ్నిస్తుంది. 16వ శతాబ్దిలో స్త్రీలు మౌనంగా ఉండిపోయారు. ఎలిజబెతియన్‌ సాహిత్యం అంతా మగవారితోనే నిండి పోయింది. ఆ కాలంలో స్త్రీలు పిల్లల్ని కంటూ, ఇంటి పనులు చేసుకుంటూ వుండి పోయారు. వారి చేతిలో డబ్బులేదు. ప్రత్యేకమైన గది అంటూ వారికి లేదు. క్రీస్తు పుట్టుకకు 600 సంవత్సరాల ముందే Shappho అనే కవయిత్రి గ్రీకు ఐలాండ్‌లో కవిత్వం రాసిన ఆనవాళ్లు వున్నాయి. ఆ తర్వాత 1000 సంవత్సరంలో జపాన్‌కు చెందిన court Lady, Lady Murasaki అనే వనిత పెద్ద నవలనే రచించింది. కానీ జుఅస్త్రశ్రీaఅసలో 16వ శతాబ్దిలో మహిళల్లో కదలిక మొదలయ్యింది అని అంటుంది వూల్ఫ్‌. 19వ శతాబ్ది ప్రారంభంలో మాత్రమే మహిళా రచయిత్రుల సంఖ్య పెరగడం ఆరంభమైంది. 19 వ శతాబ్ది ప్రారంభ దశకంలో మహిళల నవలలు autobiographical గా ఉండేవి. వారి వ్యక్తిగత సమస్యలు, బాధలు, కష్టాలు, కన్నీళ్లు చెప్పుకునేవారు. ”రచయిత్రి, స్త్రీ మానసిక స్థాయిలో వచ్చే మార్పులను, పరిణామాలను రికార్డు చేయాలి. వారి జీవితాలను నిర్దేశిస్తున్న కారణాలని నిశితంగా పరిశీలించాలి. వాటిని గుర్తించి, అధిగమించే మార్గాలను నిర్మించుకోవాలి. వివక్షతలను బయటి ప్రపంచానికి తెలియజేసి కొత్త పునాదులు వేసుకోవాలి. కేవలం వారి ఒక్క జీవితాన్ని మాత్రమే గాక సమాజాన్ని చదవాలి, పరిశీలించాలి. ఇతరుల జీవితాలలోని సమస్యలకు కారణాలు అన్వేషించాలి. అప్పుడు మహిళ తన లక్ష్యాన్ని, గమ్యాన్ని వ్యక్తిగతంగా గాకుండా ఒక సామూహిక ఆలోచనగా చూడగలుగుతుంది. ఫలితంగా మహిళల రచనలు అర్ధవంతంగాను, సంపద్వంతంగాను పరిఢవిల్లుతాయి” అని భావిస్తుంది వూల్ఫ్‌.
వూల్ఫ్‌ ఉద్దేశపూర్వకంగా, స్పహతో ఆలోచించే సామర్ధ్యం కలిగి వుండి, హేతుబద్దమైన ఆలోచన, విశ్లేషణ, తర్కంపై దష్టి కేంద్రీకరిస్తూ, నిర్మాణాత్మకమైన రచనలను చేస్తుంది. లోతుగా పాతుకుపోయిన ఊహల హేతుబద్దతను ప్రశ్నిస్తుంది. వాస్తవమేది, అసంగతమైన విషయాలేమిటి అన్న వాటిని అన్వేషిస్తుంది. పురుషులు పురుషుల దష్టితోనే గాక, స్త్రీలు స్త్రీల దష్టితోనే గాక ‘ఆండ్రోజినస్‌’ ((Androgynous) అప్రోచ్‌తో జెండర్‌ విలువలను, మానవ భావోద్వేగాలను, మానవ అనుభవాలను తమ రచనల్లో వ్యక్తీకరించాలి అని పలుకుతుంది.
వూల్ఫ్‌, శతాబ్దాల చరిత్రలో స్త్రీ స్థానం ఎక్కడీ అన్న మూలాలను అన్వేషిస్తుంది. ఆధునిక సమాజంలో ఎదిగి వచ్చిన రచయిత్రులు sex consciousness తో రచనలు చేస్తున్నారని, అది సరియైనది కాదని సజనకారులు అలా వుండకూడదని, రచన సజనాత్మక కళయని, సజనాత్మక మేధ Andrigynous’ గా వుండాలని అంటుంది.
ªA Room of One’s Ownμ  సాహిత్య విలువలు, విమర్శనాత్మక విలువలతో ఈ పుస్తకం సాగుతుంది. చీకటిలో మగ్గుతున్న మహిళా రచయిత్రుల చరిత్రను వెలుగులోకి తెచ్చే ప్రయత్నం. వూల్ఫ్‌ అభిప్రాయాలు ఆమె వ్యక్తిగతం కావు. అనాలోచితంగా చేసినవి కావు. మేధావితనం, రాజకీయ పరిజ్ఞానంతో చేసినవి. బాధ్యత గల సిటిజెన్‌గా వ్యక్తీకరించినవి. ఆమె రచనలు ప్రధానంగా చైతన్య స్రవంతి శైలిలో సాగుతాయి. వర్జీనియా 28, మార్చ్‌ 1941, United Kingdom, Rodmell, Sussex,, దగ్గర 59 సంవత్సరాల వయసులో విషాద స్థితిలో మరణించింది. స్త్రీల పక్షాన నిలబడి ధైర్యంగా సమాజాన్ని ప్రశ్నించి, ఎదిరించి తన అభిప్రాయాలను సూటిగా వ్యక్తీకరించిన మహిళ. తన బాల్యంలోనే బంధువర్గంలోని మగవారి చేతిలో లైంగికంగా దాడికి గురికావడంతో ఆ సంఘటనలు ఆమె మనసుపై తీవ్ర ప్రభావం చూపాయి. ఆమె జీవితంలో అనేకమార్లు విషాద ఘటనలు జరగడం,trauma లోకి వెళ్లడం, ఆత్మహత్యలకు ప్రయత్నించడం జరిగాయి. చివరికి తీవ్రమైన మానసిక సంఘర్షణకు గురయి, డిప్రెషన్‌ బారిన పడిన వూల్ఫ్‌ ఇంగ్లాండ్‌లో తన ఇంటికి దగ్గరగా వున్న ఔస్‌(Ouse)నదిలో మునిగి ఆత్మహత్య చేసుకోవడం ఒక వైచిత్రి.
– డా. రూప్‌ కుమార్‌ డబ్బీకార్‌, 99088 40186

Spread the love