– ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి, మంచాల రమాదేవి
నవతెలంగాణ-హనుమకొండ
ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ పోరాట ఫలితంగానే కేంద్రం దిగి వచ్చి మహిళా రిజర్వేషన్ బిల్లు తీసుకువస్తున్నదని ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి మంచాల రమాదేవి అన్నారు. హనుమకొండ అంబేద్కర్ జంక్షన్ లో మంగళవారం ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ ఆధ్వర్యంలో మహిళా రిజర్వేషన్ ఉద్యమ నాయకురాలు గీతా ముఖర్జీ చిత్ర పటానికి పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. అనంతరం మహిళలకు స్వీట్లు అందజేశారు. ఈ సందర్భంగా రాసమాల దీన అధ్యక్షతన జరిగన సమావేశంలో ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి రమాదేవి మాట్లాడుతూ మాజీ పార్లమెంటు సభ్యురాలు గీతాముఖర్జీ 1996 సెప్టెంబర్ 12 న పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశ పెట్టడం జరిగిందని,అప్పటి నుండి నేటి వరకు 27 సంవత్సరాలుగా గీతా ముఖర్జీతో పాటు అనేకమంది మహిళా నేతలు దేశవ్యాప్తంగా నిరసన గళాన్ని వినిపించడం జరుగుతున్న దన్నారు. ప్రభుత్వానికి దాని ఆవశ్యకత గురించి కోర్టు చెప్పడం జరిగిందని, అనేకమార్లు రెండు సభలలో అనేక అడ్డంకులు ఎదుర్కొని నేడు ఆముద్ర పొందడం హర్షించదగ్గ విషయం అన్నారు. ఈ విజయం పూర్తిగా మాజీ పార్లమెంట్ సభ్యురాలు గీతా ముఖర్జీకే దక్కుతుందని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటు ద్వారా జాయింట్ సెలెక్ట్ కమిటీ చైర్మన్‌గా గీతా ముఖర్జీ దేశవ్యాప్తంగా విస్తత ప్రచారం చేసి అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను సేకరించి పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టిందన్నారు. గీతా ముఖర్జీ సేవలు మరువలేవని, భారత జాతీయ మహిళా సమాఖ్య మహిళా లోకానికి అండగా నిలబడుతుందని అన్నారు. మహిళా సమస్యల పై నిరంతరం ఉద్యమించాలని, హక్కుల సాధన కోసం మహిళలు కలిసి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు రాస మల్ల దీన, మరియా, అంబాల లక్ష్మి,సాపూరు పల్లవి, మాట్ల పుష్ప తదితరులు పాల్గొన్నారు.