మహిళల తేజోమూర్తి సావిత్రిబాయి పూలే

– బీఎస్పీ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి బర్క కృష్ణయ్య
నవతెలంగాణ-షాబాద్‌
మహిళల తేజోమూర్తి, భారత తొలి ఉపాధ్యాయురాలు, తొలి సామాజిక విప్లవకారిణి, కులవ్యవస్థకు చమరగీతం పాడిన సావిత్రిబాయి పూలేను ఆదర్శంగా తీసుకోవాలని బీఎస్పీ పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి బర్క కృష్ణయాదవ్‌, షాబాద్‌ సర్పంచ్‌ తమ్మలి సుబ్రమణ్యేశ్వరీరవీందర్‌ అన్నారు. బుధవారం సావిత్రిబాయి పూలే జయంతిని పురస్కరించుకొని షాబాద్‌ మండలంలో బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో సావిత్రిబాయి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళ్లులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆధునిక భారతదేశ చరిత్రలో కుల వ్యవస్థను సమగ్రంగా విశ్లేషించి బడుగు, బలహీన వర్గాల ప్రజలకు పాఠాలు చెప్పిన తొలి ఉపాధ్యా యురాలు సావిత్రిబాయి పూలే అని కొనియాడారు. స్త్రీ ఇంటి నుంచి బయటకు రాకుండా ఆగ్రవర్ణాల ఆధిపత్యం ఉండే వ్యవస్థ ఉన్న కాలంలోనే మహిళల కోసం ప్రత్యేక విద్యా సంస్థలను నెలకొల్పి తొలి సామాజికి విప్లవకారిణి సావిత్రిబాయి అని గుర్తు చేశారు. కోట్ల మందిని చైతన్య పరిచి మహిళల జీవితాల్లో వెలుగు నింపిన చైతన్యమూర్తి అని వివరించారు. అట్టడుగు వర్గాల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రయత్నించిన సావిత్రిబాయి పూలే నేటి తరానికి ఆదర్శనీయురాలు అన్ని, ప్రజల గుండెల్లో చిరకాలం నిలుస్తారన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ మండల అధ్యక్షులు వెంకటేష్‌, నాయకులు కర్రె శ్రీశైలం, శ్రీనివాస్‌, చందు, నర్సింహులు, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love