విజువల్‌ ఎఫెక్ట్స్‌లో అద్భుతాలు స్పష్టించాలి

In visual effects Miracles should be clarifiedకల్ప్రా విఎఫ్‌ఎక్స్‌ సంస్థ ప్రారంభోత్సవం శుక్రవారం ప్రసాద్‌ల్యాబ్స్‌లో వైభవంగా జరిగింది. నికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ మంత్రి హరీష్‌ రావు మాట్లాడుతూ, ‘కల్ప్రా విఎఫ్‌ఎక్స్‌ సీఈవో మలిశ్వర్‌ సిద్దిపేట లాంటి పట్టణాల్లో ఐటీ కంపెనీని పెట్టి ఎంతో మంది యువతను ప్రోత్సహించారు. ఇప్పుడు కల్ప్రా విఎఫ్‌ఎక్స్‌తో కూడా ఉపాధి కల్పించబోతున్నారు. అలాగే తెలుగు సినిమాల్లో విజువల్‌ ఎఫెక్ట్స్‌ స్థాయిని కూడా పెంచబోతున్నారు. హాలీవుడ్‌తో తెలుగు సినిమా పోటీ పడేందుకు విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఉపయోగపడతాయి. అలాగే ఏఐ విజువల్‌ ఎఫెక్ట్స్‌ టెక్నాలజీ తెలుగు చిత్రపరిశ్రమ ఉన్నతికి మరింత దోహదపడుతుంది. విజువల్‌ ఎఫెక్ట్స్‌లో అద్భుతాలు సృష్టించాలి. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాకు ఆస్కార్‌ అవార్డులు రావడం తెలుగు ప్రజలందరికీ గర్వకారణం. తెలుగు ప్రజల గౌరవం ప్రపంచవ్యాప్తంగా పెరగాలి. మరింత మంచి చిత్రాలు విజువల్‌ ఎఫెక్ట్స్‌లో రావాలి. కల్ప్రా విఎఫ్‌ఎక్స్‌ సంస్థ తెలుగు పరిశ్రమలో రాణించాలని, మంచి అవకాశాలు అందుకోవాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు.

Spread the love