టిసిఎస్‌లో ఇంటి నుంచి పనికి స్వస్తి..!

Stop working from home in TCS..!న్యూఢిల్లీ : కరోనా సమయం నుంచి ఇంటి నుంచి పని చేస్తున్న ఉద్యోగులు ఇకపై ఆఫీసుకు రావాల్సిందే నని ఐటి కంపెనీలు వరుసగా ఆదేశాలు జారీ చేస్తున్నాయి. తాజాగా దేశంలోనే అతిపెద్ద ఐటి కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టిసిఎస్‌) ఇంటి నుంచి పని విధానం (వర్క్‌ ఫ్రం హోం)కు స్వస్తి పలకాలని నిర్ణయించింది. అక్టోబర్‌ 1 నుంచి వారంలో ఐదు రోజులు కచ్చితంగా కార్యాలయాలకు వచ్చి పని చేయాల్సిందేనని ఉద్యోగులకు మెయిల్స్‌ ద్వారా సమాచారం ఇచ్చినట్లు రిపోర్ట్‌లు వస్తున్నాయి.
కరోనా తగ్గుముఖం పట్టినప్పటి నుంచి హైబ్రిడ్‌ వర్క్‌ పద్దతికి అనుమతించింది. దీంతో వారంలో సగం రోజులు కార్యాలయాలకు వచ్చి.. మిగితా రోజులు ఇంటి నుంచి పని చేస్తున్నారు. ఇకపై ఆ మిగిలిన రెండు రోజులు కూడా ఆఫీసుకు రావాల్సిందేనని టిసిఎస్‌ సిఇఒ, చీఫ్‌ హ్యుమన్‌ రిసోర్సెస్‌ ఆఫీసర్‌ పేరిట ఉద్యోగులకు ఆదేశాలు వెళ్లాయని తెలిసింది.

Spread the love