– డాక్టర్ మల్లు రవి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
పనులు వేగంగా పూర్తి చేయాలని ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి అధికారులను ఆదేశించారు. ఆదివారం ఢిల్లీలో ఆయన అధికారులతో సమావేశమై శాఖల వారీగా చర్చించారు. పెండింగ్ పనుల పూర్తిపై ప్రత్యేక కార్యచరణ రూపొందించాలని సూచించారు. నీటిపారుదల, మున్సిపల్, పట్టణాభివృద్ధి తదితర శాఖలతో సమీక్షించిన మల్లు రవి, పెండింగ్ అనుమతులు, తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన నిధులు, క్లియ రన్స్లపై ఆరా తీశారు. తగిన సమాచారాన్ని సిద్ధం చేసుకుని కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, అనుమతులను వెంటనే సాధించాలని సూచించారు.