నవతెలంగాణ – అశ్వారావుపేట: ప్రజాస్వామ్యానికి నాలుగో స్తంభంగా ఉన్న జర్నలిజం సమాజంలో ఏ వర్గ ప్రజలు అణిచివేతకు గురి అవుతున్నారో ఆ ప్రజానీకం పట్ల సేవా భావంతో పని చేయాలని ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సూచించారు. ఇతరులకు చేయూత నిచ్చి నప్పుడే ఎవరి వృత్తికైనా సార్ధకత చేకూరుతుందని అన్నారు. మండలంలోని ఊట్లపల్లి లో ఆర్యవైశ్య సంఘం మండల అద్యక్షులుగా ఎన్నికైన శీమకుర్తి శ్రీనివాసరావుకు ఆదివారం అభినందన సభ జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశాభివృద్ధిలో ప్రజలు, సామాజిక వర్గాల బాగస్వామ్యం అవసరం ఉందని గుర్తు చేశారు. ఈ సందర్భంగా శీమకుర్తి శ్రీనివాసరావును సత్కరించారు.అనంతరం అనంతరం అశ్వారావుపేట, వినాయకపురం, అనంతారం గ్రామాల్లో పలు శుభ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు జూపల్లి రమేష్, సుంకవల్లి వీరభద్రరావు, సత్యనారాయణ చౌదరి, కొణిజర్ల ఉమామహేశ్వరరావు, సమయమంతుల మహేశ్వరరావు, బత్తిన పార్థ సారధి, బండారు శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.