– సీఐటీయూ మండల కార్యదర్శి ఇసంపల్లిపల్లి సైదులు
నవతెలంగాణ – నెల్లికుదురు
కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా నేడు నిర్వహిస్తున్న గ్రామీణ భారత్ బంధు కార్యక్రమానికి ప్రజలు వ్యవసాయ కార్మికులు కార్మికులు కర్షకులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సీఐటీయూ మండల కార్యదర్శి ఈసంపల్లి సైదులు గురువారం పిలుపునిచ్చారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఔట్సోర్సింగ్ కార్మికులను ఆదుకోవాలని స్కీం వర్కర్ల పేరుతో పనిచేస్తున్న కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అంగన్వాడీ ఆశ హమాలి భవనిర్మాణం గ్రామపంచాయతీ ఐకెపి వివో ఏలు మధ్యాహ్నం భోజన కార్మికులను వివిధ రంగాల స్కీం వర్కర్లుగా పనిచేస్తున్న కార్మికులందరినీ పాఠశాలలో పరిశుభ్రత కోసం పనిచేస్తున్న స్కావెంజర్ల తొలగింపును వెనక్కి తీసుకొని నియామకాలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న హమిలకే పరిమితం తప్ప ఆచరణలో అమలు చేసిన దాఖలాలు లేవని అన్నారు కేంద్ర ప్రభుత్వానికి చెంపపెట్టుగా మారాలని కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నాలుగు రైతు వ్యతిరేక చట్టాలనును వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వ రంగ కాంట్రాక్టు పని విధానంలో పని చేస్తున్న ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించి పర్మినెంట్ చేయాలని కనీస వేతనం రూ.26 వే ల రూపాయలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.