పారిశుద్ధ్య పనులను అడ్డుకున్న కార్మికులు

నవతెలంగాణ- నవీపేట్: మండల కేంద్రంలో మేకల సంత వ్యర్థాలను ప్రైవేట్ సిబ్బందితో అధికారులు తొలగించడానికి ప్రయత్నం చేస్తుండగా పంచాయతీ కార్మికులు ఆదివారం అడ్డుకున్నారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు నాయక్ వాడి శ్రీనివాస్ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా గ్రామంలో పారిశుద్ధ్య పనులను ప్రైవేటు సిబ్బందితో చేయించడాన్ని తీవ్రంగా ఖండించారు. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు పారిశుద్ధ్య పనులు జరగకుండా అడ్డుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులు పాల్గొన్నారు.
Spread the love