కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

Workers' problems should be solved– సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు కృష్ణమాచారి
నవతెలంగాణ-సిర్పూర్‌(టి)
మధ్యాహ్న భోజన పథకం కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యుడు కృష్ణమాచారి డిమండ్‌ చేశారు. మంగళవారం మండల విద్యా వనరుల కేంద్రంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికుల యూనియన్‌(సీఐటీయూ) అధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం కార్యాలయ ఉద్యోగి సామల ప్రకాష్‌కు డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని అందించారు. ఈ సంధర్భంగా ఆయన మట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకం నిర్వహాణను హరే రామ హరే కృష్ణ సంస్థకు అప్పగించాలనే రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, అసెంబ్లీ ఎన్నికల సమయంలోని మ్యానిఫెస్టోలో పొందుపరిచిన మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు రూ.10 వేల వేతనం చెల్లిస్తామన్నది వెంటనే అమలులోకి తీసుకురావాలన్నారు. పెండింగ్‌ వేతనాలు బిల్లులు చెల్లించి ఇతర సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే రానున్న రోజుల్లో పోరాటాలను ఉదృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ముంజం శ్రీనివాస్‌, యూనియన్‌ జిల్లా కోశాదికారి రూప, మండల యూనియన్‌ కమిటీ సభ్యులు లక్ష్మీ, ఖమర్‌ బేగం, రేణుకా, నిలబాయి, రజిత, అరుణా, కార్మికులు పాల్గొన్నారు.
తిర్యాణి : ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మధ్యాహ్నభోజన కార్మికులకు నెలనెలా జీతాలు చెల్లించాలని మధ్యాహ్నభోజన కార్మికుల సంఘం నాయకురాలు లక్ష్మీ డిమాండ్‌ చేశారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న మధ్యాహ్నభోజన కార్మికులు చాలీచాలని వేతనాలు తీసుకుంటూ ప్రతిరోజు విదార్థులకు నాణ్యమైన భోజనం అందించడానికి శాయశక్తుల కృషి చేస్తున్నారన్నారు. పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా నెలకు రూ.తొమ్మిది వేల జీతం పెంచి నెలనెలా జీతాలు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో మధ్యాహ్నభోజన కార్మికుల సంఘం నాయకులు వి.ఊర్మిళ, ఎం.లక్ష్మీ, ఎన్‌.లక్ష్మీ, ఎం.సునీత, సుశీల, నీలాబాయి, మహుదుబాయి పాల్గొన్నారు.

Spread the love