నవతెలంగాణ – ఉత్తరప్రదేశ్: ఉత్తరప్రదేశ్‌లోని కన్నౌజ్ రైల్వే స్టేషన్ లో నిర్మాణంలో ఉన్న భవనం పైకప్పు ప్రమాదవశాత్తూ కూలిపోయింది. దీంతో పలువురు కార్మికులు శిథిలాల కింద చిక్కుకుపోయారు. సమాచారమందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద కనీసం 20 మంది చిక్కుకుని ఉండొచ్చని అధికారుల సమాచారం. ఇప్పటివరకు ఆరుగురిని కాపాడి, వారిని ఆస్పత్రికి తరలించినట్లు తెలిసింది. శిథిలాల కింద వారిని వెలికి తీసేందుకు ముమ్మరంగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. యూపీ లోని కన్నౌజ్ రైల్వే స్టేషన్‌లో ఆధునికీకరణ పనుల్లో భాగంగా పలు నిర్మాణాలు చేపట్టారు. ఈ క్రమంలోనే శనివారం మధ్యాహ్నం రెండో అంతస్తులో ఉన్న పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది. భారీ శబ్దం రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.ఘటనకు సంబందించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.