యాదవ, కురుమల అభివృద్ధికి కృషి..

– కార్పొరేషన్ ద్వారా విద్య, ఉపాధి, సాంకేతిక రంగాలలో అభివృద్ధి
– కురుమ, యాదవ కార్పొరేషన్ ఏర్పాటుకు కృషి చేయాలి
– ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య
నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్
యాదవ, కురుమల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు. శుక్రవారం, అసెంబ్లీ లో బీసీ సంక్షేమ శాఖ మంత్రి వర్యులు పొన్నం ప్రభాకర్ ని బీర్ల ఐలయ్య కలిసి యాదవ, కురుమ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనీ వినతిపత్రం అందజేసారు. ఈ కార్పొరేషన్ ద్వారా విద్య, ఉపాధి, సాంకేతిక రంగాలలో యాదవ, కురుమలు అభివృద్ధి సాధిస్తారని బీర్ల ఐలయ్య, డాక్టర్ లోకేష్ యాదవ్, చరణ్ కౌశిక్ యాదవ్, గౌరీ సతీష్ లు విజ్ఞప్తి చేసారు. ఈ సందర్భంగా మంత్రి  సానుకూలంగా స్పందించి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ సందర్బంగా మేనిఫెస్టోలో పెట్టింది కాబట్టి కచ్చితంగా ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి లతో  మాట్లాడి ఏర్పాటు చేస్తాం అని చెప్పారు.. అని తెలిపారు. ఇందుకుగాను మంత్రికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసారు.
Spread the love