భాగ్యనగర పురోభివృద్ది కై కృషి.. 

నవతెలంగాణ – ధూల్ పేట్ 
భాగ్యనగర పురోభివృద్ది కై కృషి చేస్తున్నామని లతామా ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ, యాగ నిర్వాహకులు మాధవిలత కొంపెల్ల అన్నారు. 45 రోజుల పాటూ ప్రతిష్టాత్మకంగా భాగ్యనగరంలోని సీతారాం బాగ్ శ్రీ రామ మందిరంలో నిర్వహించబోతున్న భారత భాగ్య సమృద్ది యజ్ఞం ప్రచార కార్యక్రమాలలో భాగంగా నగర సంకీర్తన కార్యక్రమాన్ని బహుదూర్ పుర అసెంబ్లీ నియోజక వర్గ పరిథిలోని ధూద్ బౌళి లో స్థానిక బస్తీ పెద్దలతో కలసి నిర్వహించారు. ఈ సందర్భంగా అమే మాట్లాడుతూ.. వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించబడే ఈ భారత భాగ్య సమృద్ది యజ్ఞం లో ప్రధానంగా 45 రోజుల పాటూ సర్వ కార్యసిద్ది సహస్ర చంఢీసహిత మహా రుద్ర కామేశ్వర, కామేశ్వరి యాగం జరుగుతుందన్నారు. సాధారణంగా ఇంతటి బహృత్తర యజ్ఞాలను ధనవంతులు, పాలకులు తమ తమ స్వీయ శ్రేయస్సు కోసం చేయించుకోవడం చూస్తుంటామన్నారు సాధారణ ప్రజలందరి శ్రేయస్సు కోరి నిర్వహించడం మొదటి సారని చెప్పారు.  ఇలా సమాజ మంచి కోరుతూ నిర్వహించబడే ఈ యజ్ఞంలో ప్రతి కుటుంభ శ్రేయస్సు, భాగ్య సమృద్ది, వారి జీవితంలోని పలు సమస్యల నివారణ కోసం వైదిక ధర్మంలో పేర్కొనబడిన 36 రకాల వైదిక విధులు, 12 రకములైన కళ్యాణాలతో పాటూ పలు విధములైన హామాలు కూడా చేయించబడతాయని వివరించారు.  దూద్ బౌళి సిద్ది బుద్ది వినాయక మందిరం వద్ద ప్రారంభమైన నగర సంకీర్తన పాదయాత్ర రూపంలో ఆలయ పరిసరాలైన ఉమద్ బజార్, కామాటీపుర పోలిస్ స్టేషన్ పరిసరాలలో పలు బస్తీలలో కొనసాగి తిరిగి దూద్ భౌలి లో ముగిసింది.  నగర సంకీర్తన పాదయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో ట్రస్ట్ మాజీ అధ్యక్షులు యమన్ సింగ్,  స్థానిక బస్తీల నాయకులు సోమేష్, సత్యన్నారాయణ, యేషు భాయి, ఆనంద్, నిరంజన్ కుమార్ లతో పాటూ లతామా ఫౌండేషన్ కు చెందిన ప్రమోద్ కుమార్, శ్రద్దానంద్, సాయినాథ్ లతో పాటూ పలువురు లతామా పౌంఢేషన్ కార్యకర్తలు పాల్గొన్నారు.
Spread the love