పనుల్లో జాప్యం లేకుండా త్వరగా పూర్తి చేయాలి

నవతెలంగాణ – కూకట్‌ పల్లి
వివేకానంద నగర్‌ డివిజన్‌ పరిధిలోని బాగ్‌ అమీర్‌, సప్తగిరి కాలనీలలో సీసీ రోడ్లు, బిటి రోడ్ల నిర్మాణ పను లను కార్పొరేటర్‌ మాధవరం రోజాదేవి రంగరావుతో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొన్న ప్రభుత్వ విప్‌ ఆరెకపూడి గాంధీ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గాంధీ మాట్లా డుతూ సంక్షేమం, అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని ముఖ్యమంత్రి కెసిఆర్‌ మార్గదర్శకం లో, మంత్రి కేటీఆర్‌ సహకారంతో శేరిలింగంపల్లి నియోజకవ ర్గంను అన్ని రంగాలలో అభివృద్ధి చేసి ఆదర్శవంతమైన ,అగ్రగామి నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని ప్రభుత్వ విప్‌ గాంధీ పేర్కొన్నారు. మౌలిక వసతుల కల్పనకు పెద్ద పీట వేస్తామన్నారు. నాణ్యత విషయంలో ఎక్కడ రాజి పడకూడదని సూచించారు. ప్రజలకు ట్రాఫిక్‌ రహిత ,సుఖ వంతమైన ,మెరుగైన రవాణా సౌకర్యం కోసం శాయ శక్తుల కషి చేస్తానని,అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని పేర్కొ న్నారు. పనుల్లో జాప్యం లేకుండా త్వరిత గతిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. మాజీ కార్పొరేటర్‌ మాధవరం రంగరావు, వివేకానంద నగర్‌ డివిజన్‌ బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షులు సంజీవ రెడ్డి, బీఆర్‌ఎస్‌ నాయకులు గొట్టిముక్కల పెద్ద భాస్కర్‌ రావు ,నాయి నేని చంద్రకాంత్‌ రావు, రాంచందర్‌, ఆంజనేయులు, విద్యాసాగర్‌, ఆంజనేయులు, స్వరూప, శర్మ, మల్లయ్య, రమేష్‌, చంద్రమోహన్‌ సాగర్‌, లింగయ్య, ఎర్రలక్ష్మయ్య, ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు

Spread the love