కాల్వల మరమ్మతులకు పనులు ప్రారంభం

నవతెలంగాణ – గోవిందరావుపేట
లక్నవరం చెరువు ప్రధాన కాలువలకు మరమ్మత్తులకు గురువారం పూజా కార్యక్రమాలతో పనులు ప్రారంభం చేయనున్నట్లు చెరువు ఏఈ క్రాంతి తెలిపారు. మండల కేంద్రంలో బుధవారం క్రాంతి మీడియాతో మాట్లాడుతూ లక్నవరం చెరువు ప్రధాన కాలువైన రంగాపురం కోట కాలువ నరసింహ కాలువ శ్రీరాంపతి కాలువలకు ప్రభుత్వ నిధుల నుండి కోటి రూపాయలు మంజూరి అయినట్లు తెలిపారు. ఈ పనులను గురువారం ఎమ్మెల్యే సీతక్క పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నట్లు తెలిపారు. గాంధీనగర్ సమీపంలోని కోట కాలువ వద్ద పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు . ఈ కార్యక్రమాలకు జడ్పిటిసి తుమ్మల హరిబాబు ఎంపీపీ శ్రీనివాసరెడ్డి పలువురు ప్రజా ప్రతినిధులు హాజరవుతున్నట్లు పేర్కొన్నారు. రైతులు కూడా హాజరై కార్యక్రమాన్ని వీక్షించాలని సూచించారు.

Spread the love