పట్టణంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమాలు..

నవతెలంగాణ – ఆర్మూర్  

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా బుధవారం మండల పరిషత్ ఆవరణలో పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహించినారు.. ముఖ్యంగా పర్యావరణాన్ని కాపాడాలంటే మొక్కలను పెంచడం, అన్ని రకాల జీవజాతులను రక్షించడం , ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి ప్లాస్టిక్ రహిత సమాజాన్ని నిర్మించుకోవాలని తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పర్యావరణ రక్షణ కొరకు ప్రతిజ్ఞ చేయించడం జరిగినది. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సాయిరాం, ఎంపీఓ శ్రీనివాస్, ఏపీవో సురేష్, ఇంజనీరింగ్ కన్సల్టెంట్ ప్రశాంత్, సాంకేతిక సహాయకులు నరేష్, రాము, భరత్ వివిధ గ్రామాల ఫీల్డ్ అసిస్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.
గురుకుల మహిళ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో..
పర్యావరణం పై అవగాహన పెరిగేలా ప్రధాన కూడళ్లలో నినాదాలు చేస్తూ, పాటలు పాడుతూ, మానవహారం ఏర్పాటు చేసినారు.. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ జి ధనవేణి మాట్లాడుతూ భూమి పునరుద్ధరణ ఎడారీకరణ ను ఆపడం పచ్చదనాన్ని పెంపొందించేలా పలు విషయాలపై అవగాహన కల్పించటం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ శరణ్య ,కళాశాల అధ్యాపక బృందం విద్యార్థినిలు పాల్గొన్నారు..
Spread the love